యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో హిట్స్తో మంచి ఊపు మీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతోతో 50కోట్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్, తన తరువాత సినిమా జనతా గ్యారేజ్ పై భారీగానే కసరత్తు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాలశివ చాలా పగడ్బంధీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే, తాజాగా ఈ సినిమా బిజినెస్ లో ఒక కొత్త చిక్కు వచ్చి పడింది.
ఇంతకీ ఏంటి ఆ చిక్కు అంటే…తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన మైత్రి మూవీస్ కి మంచి బయ్యర్స్ సర్కిల్ ఏర్పడింది. వారు ఏ సినిమా తీసిన ఆ సర్కిల్ ను దాటి ఇతర బయ్యర్స్ కు సినిమాను అమ్మలేరు. అయితే అనుకున్న ప్రకారం మైత్రీ మూవీస్ వాళ్ళు ఈ సినిమాను సైతం తమ సర్కిల్ లోనే ఉన్న వారికి అమ్మాలి అని అనుకున్నారు. కానీ అలా అమ్మడం కుదరడం లేదు మైత్రీ వారికి..దానికి గల కారణం ఏంటి అంటే…హీరో ఎన్టీఆర్….ఆయనే స్వయంగా ఇన్ వాల్వ్ అయ్యి మరీ, ఈ సినిమాను తను చెప్పిన వాళ్లకే డిస్ట్రిబ్యూషన్ ఇమ్మని చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ అలా అనడంతో డైలామాలో పడ్డారు మైత్రీ నిర్మాతలు…ఎందుకంటే హీరో మాటని పక్కకి పెట్టడం కుదిరే పని కాదు. హీరో చెప్పిన తరవాత కాదు అని ఒదిలేయడం కష్టం. హీరో మాటకి విలువ ఇచ్చే ఇండస్ట్రీ లో ఉంటూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తూ అతని మాటని జవదాటడం మైత్రీ కి కష్టం, అలాగే ఏర్పడిన డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ని కూడా కాదు అనడానికి లేని పరిస్థితి. మరి ఈ సమస్యని వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.