మెగాస్టార్.. మెగాస్టార్ అని ప్రత్యేకంగా అనిపించుకోవాలా? 67 ఏళ్ళ వయసులో మెగాస్టార్ అనిపించుకోవడానికి ఇంత కష్టపడాలా? ఇవి కొందరి మనసులో ఉన్న ప్రశ్నలు? ఇంకొంతమంది ఈ ప్రశ్నలపై తెగ డిస్కస్ చేసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే? ఆగస్టు 11న చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ విషయం పై అభిమానులు కానీ తెలుగు సినీ ప్రేక్షకులు కానీ ప్రత్యేకంగా బాధపడుతుంది అంటూ ఏమీ లేదు.
ఎందుకంటే ‘భోళా శంకర్’ దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు అలాంటిది. ‘శక్తి’ ‘షాడో’ వంటి భీభత్సమైన ప్లాపులు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ అతనిది. మరి ఇంకేంటి ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు.? అక్కడికే వస్తున్నా.. ‘మెగాస్టార్ చిరంజీవి ఇక రీమేక్ లు చేయడం మానేయాలి?’ అనేది కొందరి వాదన అయితే.. ‘చిరంజీవి దర్శకుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అనేది ఇంకొందరి అభిప్రాయం. ఇంకొందరి అభిప్రాయం ఏమిటంటే.. ‘చిరు తన వయసు’ కి తగ్గ పాత్రలు చేస్తే బెటర్ అని’.! ‘భోళా శంకర్’ లో ‘రష్మీతో చిరు రొమాన్స్ చేయడం..
శ్రీముఖితో ‘ఖుషి’ రీ క్రియేషన్ సీన్స్ వంటివి చేయడం చిరు మానేస్తే బెటర్.. అని కొందరు అంటున్నారు. అలాగే స్టేజిపై చిరు మైక్ పట్టుకుంటే హీరోయిన్ల పై చేసే రొమాంటిక్ కామెంట్లు కూడా ఆయన స్థాయికి తగ్గట్టు లేవు. పైగా 30 నిమిషాల పాటు ఆయన అందరి గురించి మాట్లాడి… అందరినీ ‘ములం చెట్టు’ ఎక్కించేస్తున్నారు. చిరు ఇలా ఉండాలి అని మెగా అభిమానులు కోరుకోవడం లేదు. ‘జైలర్’ సినిమాలో రజినీకాంత్ రిటైర్ అయిపోయిన జైలర్ పాత్రలో కనిపించినా చప్పట్లు కొట్టారు అభిమానులు.
చిరు అభిమానులు కూడా అలాంటివి చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ పాత్రలో అంత హుందాతనం ఉంటుంది. ‘జైలర్’ లో రజినీకాంత్ ఎక్కడా ఫైట్ చేసింది అంటూ ఏమీ లేదు. గన్ తో కాల్చడం.. ఒకరి తలనరికి ఇంకొకరి చెవి కోయడం వంటివి తప్ప. అయినా రజినీకాంత్ అలా నడిచొస్తే సరిపోయింది. చిరు నుండి కూడా ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే సరిపోతుంది.పరుచూరి గోపాలకృష్ణ గారు గాడ్ ఫాదర్ సినిమా గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ..
‘చిరంజీవి (Chiranjeevi) పక్కన ఉండగా సల్మాన్ ఖాన్ తో ఫైట్ చేయించడం బాలేదు అన్నారు’..! బహుశా మీదున్న అభిమానంతో ఆయన అలా అనుండొచ్చు. అయితే ఇలాంటి అభిమానుల ఫీలింగ్స్ ను చిరు పక్కన పెట్టేయాలి. చిరు అలా నడిచొస్తే.. సల్మాన్ ఫైట్ చేయడం చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు.. విజిల్స్ వేశారు. సో చిరుతో పాటు ఇలాంటి అభిమానులు కూడా మారాలి.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!