2019లో చెప్పుకోదగ్గ విజయాల్లో “జెర్సీ” ఒకటి. కమర్షియల్ గా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా.. నాని కెరీర్ లో మైలురాయి చిత్రంగా మాత్రం మిగిలిపోయింది. ఈ సినిమాని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు విడుదల సమయంలో ఇరు ఇండస్ట్రీల అగ్ర దర్శకనిర్మాతలు, కథానాయకులు పోటీపడ్డారు. ఊహించని విధంగా హిందీ రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకొన్నాడు. రాణాతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేయనున్నాడు దిల్ రాజు.
నిజానికి “జెర్సీ” రీమేక్ ఈపాటికే మొదలవ్వాల్సి ఉండగా.. సినిమా హీరో ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో సినిమాను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారట. నిజానికి ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ అనుకున్నప్పటికీ.. షాహిద్ కపూర్ ను ఫైనల్ చేశారు. అయితే.. “కబీర్ సింగ్” సూపర్ హిట్ అనంతరం తన రెమ్యూనరేషన్ ను ఏకంగా 40 కోట్లు చేసేశాడు షాహిద్. దాంతో ఇప్పుడు షాహిద్ కి అంత పెట్టడం ఎందుకు వేరే హీరోను తీసుకోవచ్చు కదా అని హిందీ నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అభిప్రాయపడుతుండగా.. సాహిద్ తప్పితే ఎవరూ న్యాయం చేయలేరని ఫిక్స్ అయ్యాడట దిల్ రాజు. ఈ డిస్కషన్ కి తెరపడితే కానీ.. సినిమా మొదలవ్వదు.