ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు… ఆ తరువాత సెకండ్ హీరోగా .. ఆ పైన ఇండస్ట్రీ కి మెగాస్టార్ అయ్యి కూర్చున్నారు మన చిరంజీవి. ఇప్పటికీ ఆ పొజిషన్ ను ఎవ్వరూ రీ ప్లేస్ చెయ్యలేకపోయారు అంటే.. ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం సినిమాల్లో హీరోగా నటిస్తేనే చిరు ఈ స్థాయిలో ఉన్నారా అంటే.. అది అతిసయోక్తే అవుతుంది. హీరోగానే కాకుండా.. సినిమాకి సంబందించిన అన్ని డిపార్ట్మెంట్ లో మెగాస్టార్ కు పట్టు ఉంది.
కథని… తన ఫ్యాన్స్ కు అలాగే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చేత మార్పులు చేయించుకోగలరు. ఆయన జడ్జ్ మెంట్ పక్కాగా ఉంటుంది అని ఇండస్ట్రీ లో చాలా మంది చెబుతుంటారు. ఇక తన వంతు నటించడం అయిపొయింది అని సెట్లో ఉండకుండా వెళ్ళిపోయే వ్యక్తి కాదు… అక్కడే ఉండి అందరి నటీ నటుల పనితనాన్ని పరిసీలించి … వారికి సలహాలు కూడా ఇస్తుంటారట మెగాస్టార్. అలా అన్ని విధాలుగా కష్టపడతారు కాబట్టే … ఆయన ఈ స్థాయిలో ఉన్నారు.
ఇక ఈ లాక్ డౌన్ రోజులలో కూడా అందరు సెలబ్రిటీలు ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడుపుతున్నారు. అయితే మన మెగాస్టార్ అందుకు అదనంగా స్పానిష్ నేర్చుకుంటున్నారట. తన మనవాళ్ళు, మనవరాళ్లు ఆన్లైన్ లో స్పానిష్ కోర్స్ నేర్చుకుంటున్న నేపధ్యంలో మెగాస్టార్ కూడా వారితో పాటు ఆ కోర్స్ నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సమయాన్ని వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో మెగాస్టార్ ఇలా చేస్తున్నట్టు సమాచారం. మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. వారి అభిమానుల్ని కూడా ఖుషీ చేయిస్తున్నారు మెగాస్టార్.