కథ లేకుండా, బౌండెడ్ స్క్రిప్టు లేకుండా సినిమాలు ఓకే అయిపోవడం ఇటీవల వస్తున్న ట్రెండ్. డైరక్టర్ మీద నమ్మకం, ముందుగా చేసుకున్న కమిట్‌మెంట్ ఇలా కారణంగా ఏదైతేనేం హీరోలు కొన్ని సినిమాలు పూర్తిగా కథ లేకుండానే ఓకే చేసుకున్నారు. కొంతమంది హీరోలు గతంలో చాలాసార్లు ఈ మాట చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ కూడా ఇదే పని చేశాడా. అవుననే అంటున్నాడు టాలీవుడ్ వర్గాలు. అక్కడివరకు ఓకే.. ఆయన అలా చేయడం వల్ల ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రెండు, మూడు నెలలు గ్యాప్ అయితే పక్కా వస్తుందంటున్నారు. అదీ విషయం.
#ఎన్టీఆర్30… ఈ సినిమా ప్రకటించినప్పటి నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ‘అరవింద సమేత’ లాంటి మంచి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అభిమానులు ఆనందపడ్డారు. వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం అందరికీ కలిగింది. అనుకున్నట్లే త్రివిక్రమ్ సినిమా ఆగిపోయి… దాని ప్లేస్‌లోకి కొరటాల శివ సినిమా వచ్చింది. హడావుడిగా సినిమా ప్రకటించేశారని ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఈ క్రమంలో సినిమా పూర్తి కథ సిద్ధం కాలేదట.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్‌కు తన దగ్గరున్న ఓ సినిమా పాయింట్ చెప్పి ఓకే చేసుకున్నాడట. ‘ఆచార్య’ పనులు పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా పనులు మొదలుపెడతాడు. ‘ఆచార్య’ పనులు అవ్వడానికి, ఎన్టీఆర్ కోసం పూర్తి కథ సిద్ధం చేసుకోవడానికి కనీసం మూడు, నాలుగు నెలలు అయితే పడుతుంది. మరి ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ ఏం చేస్తాడు అనేదే ఇక్కడ ప్రశ్న. విదేశాలకు ట్రిప్‌లకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే గ్యాప్‌లో ఎవరు మీలో కోటీశ్వరుడు పూర్తి చేసేస్తాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది.