సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత నటీనటులకు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. వారితో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో విచ్చల విడిగా హీరోయిన్ల ఫోటోల పై కొందరు పనిగట్టుకుని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొందరి నెటిజెన్ల పదజాలం కూడా వారిని చాలా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోని నెటిజెన్లకి ఇప్పుడు ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కూడా తోడవడంతో సెలబ్రిటీలు ఇంకా భయపడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ న్యూ*డ్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Pragya Nagra
అది ఎక్కువగా వైరల్ అవుతుండటంతో స్వయంగా ఆ హీరోయిన్ బాధపడుతూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రగ్యా నగ్ర (Pragya Nagra) ఆ వీడియో పై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో నాది కాదు. మళ్ళీ చెబుతున్నాను నాది కాదు. చెప్పుకోడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. టెక్నాలజీ అనేది మన జీవితాలకి ఉపయోగపడాలి. దానిని మనం పాజిటివ్ గా ఉపయోగించుకోవాలి. కానీ ఇలాంటి దారుణమైన కంటెంట్లు క్రియేట్ చేయడానికి కాదు. ఆ వీడియో నా ప్రైవేట్ వీడియో అంటున్నారు. కానీ అది ఏఐ వాడి చేసిన వీడియో.
ఇలాంటి వీడియో క్రియేట్ చేసిన వారి మైండ్ సెట్ తలుచుకుంటే జాలేస్తుంది. ఈ వీడియో విషయంలో నాకు అండగా నిలబడిన వారికి థాంక్స్. నాకు వచ్చిన ఈ ఘోరమైన పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రగ్యా నగ్ర పలు తమిళ, మలయాళ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించింది. ఇటీవల వచ్చిన ‘లగ్గం’ (Laggam) సినిమాలో కూడా హీరోయిన్ గా (Pragya Nagra) నటించింది. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.