దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇంటర్నేషనల్ వైడ్ గా పలువురి దృష్టిని ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంటూ ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను దక్కించుకొని సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా సాధించిన విజయాన్ని, దక్కించుకున్న అవార్డులను చూసి హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రీసెంట్ గా ‘నాటు నాటు’ సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకోవడమే కాకుండా.. క్రిటిక్స్ చాయిస్ న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. ఇదిలా ఉండగా.. రాజమౌళిపై కొన్నిరోజులుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి పలు అంతర్జాతీయ పత్రికలకు, మ్యాగజైన్స్ కి కొన్ని రోజులుగా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా అమెరికాకు చెందిన ఒక మ్యాగజైన్ రాజమౌళిని టార్గెట్ చేసింది. రాజమౌళిని ఇరకాటంలో పెడుతూ.. పలు ప్రశ్నలను సంధించింది. ‘నాటు నాటు’ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ ని పక్కన పెట్టేశారని విమర్శించింది. దీనికి రాజమౌళి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ గా బదులిచ్చారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని పక్కన పెట్టామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. తను, కీరవాణి, చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఇతర అవార్డుల విషయంలో ఆ క్రెడిట్ ను పొందాం కానీ అసలు క్రెడిట్ మాత్రం ప్రేమ్ రక్షిత్ దే అని చెప్పారు.
నాలుగు సెట్ ల ఐడియా కోసం ఏడు వారాల సమయం తీసుకున్నారు. ఈ పాట క్రెడిట్ మాత్రమే కాదు.. సినిమాలోని ఐకానిక్ ఫైట్, చరణ్ ని జైలు నుంచి విడిపించి ఎన్టీఆర్ భుజాలపై మోస్తూ వెళ్లే ఫైట్ ఐడియా కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టరే ఇచ్చారని.. అతని ఇన్ పుట్స్ ని తీసుకునే ఆ ఫైట్ ని డిజైన్ చేశామని చెప్పారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?