ప్రస్తుతం ఇండియన్ సినిమా లవర్స్ లో ఎక్కువగా చర్చకు దారితీసిన పేరు డాన్ లీ. కోరియన్ నటుడైన డాన్ లీ ఇప్పుడు ప్రభాస్ (Prabhas) , సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో రాబోయే సినిమా ‘స్పిరిట్’(Spirit) లో ప్రతినాయకుడిగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక సమాచారం లేకపోయినా, డాన్ లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ కు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను షేర్ చేయడంతో ఒక్కసారిగా విషయం హాట్ టాపిక్ గా మారింది.
Don Lee
అసలు ఎవరు ఈ డాన్ లీ? అనే విషయం మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు చాలా మంది. డాన్ లీ అసలు పేరు లీ డాంగ్-సియోక్. సౌత్ కొరియాలో పుట్టిన ఈ నటుడు 19 ఏళ్ల వయస్సులో అమెరికాలో స్థిరపడి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అమెరికాలో కొంతకాలం ట్రైనర్‌గా కూడా పనిచేశారు. నటనలోకి అడుగుపెట్టి, 2004లో ‘డాన్స్ విత్ ది వింగ్’ సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించారు. మొదట కొరియన్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలు చేస్తూ, ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.
2012లో డాన్ లీ ‘ది నైబర్స్’ చిత్రంలో తన సహాయ పాత్రకు గాను చాలా అవార్డులు గెలుచుకున్నారు. హాలీవుడ్ లో కూడా అతని ప్రతిభను చాటాడు. మార్వెల్ సినిమాల సిరీస్ లో వచ్చిన ‘ఎటర్నల్’ చిత్రంలో సూపర్ హీరోగా నటించడం ద్వారా అతనికి గ్లోబల్ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
అలాగే 2016లో వచ్చిన ‘ట్రైన్ టూ బుసాన్’ చిత్రం అతనికి మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడిదంతా చూసినప్పుడు డాన్ లీ స్పిరిట్ లో నటించబోతున్నాడు అంటే అంచనాలు ఉహాలకందని రేంజ్ లో పెరిగాయి. ఇండియన్ సినిమా ప్రేక్షకులకి కొత్తగా కనెక్ట్ అవడం, ప్రభాస్ తో కలిసి నటించడం వంటి అంశాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఇండియన్ సినిమాలోకి అతని ఎంట్రీ మరో స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.