Coolie: ‘కూలీ’ సినిమా కోసం లోకేశ్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ తెలుసా?

కొన్ని సినిమాలకు హైప్‌ రావడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. జస్ట్‌ సినిమా కాస్టింగ్‌ గురించి ఒక్కో విషయం చెబుతూ ఉంటే చాలు. ఆటోమేటిగ్గా సినిమా మీద హైప్‌ పెరిగిపోతుంది. దీనికి మీకు లేటెస్ట్‌ ఉదాహరణ కావాలి అంఏట ‘కూలీ’ సినిమా ప్రచారం చూడండి అర్థమైపోతుంది. ఇప్పటివరకు మూడు పోస్టర్లు మాత్రమే రివీల్‌ చేసిన టీమ్‌ కావాల్సినంత ప్రచారం అయితే తెచ్చుకుంది. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు రాస్తే సౌత్‌ నుండి వచ్చే సినిమాల్లో ‘కూలీ’ (Coolie)  ఒకటి.

Coolie

రజనీకాంత్‌(Rajinikanth) – లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాలో కొత్త యాక్టర్లను తాజాగా ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తూ వస్తున్నారు. దీని కోసం సినిమా టీమ్‌ ఓ పదాన్ని హైలైట్‌ చేస్తోంది. అదే DISCO. ఇందులో ఇప్పటికే రెండు అక్షరాలు బయటకు వచ్చాయి. ఇంకో మూడు బయటకు రావాలి. మయాళ సినిమా నుండి టాలెంటెడ్ నటుడు సౌబిన్ సాహిర్‌ను ‘దయాల్’ అంటూ పరిచయం చేసిన ‘కూలీ’ టీమ్‌.. ఇప్పుడు నాగార్జునను ‘సైమన్’ అనే పేరుతో పరిచయం చేశారు.

ఇక్కడ కాస్త వెనక్కి రివైండ్‌ చేస్తే సినిమా అనౌన్స్ చేసిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని హైలైట్ చేయడం గుర్తొస్తుంది. అందులో D, S ఇప్పుడు కనిపించారు. ఇంక I, C, O ఎప్పుడొస్తారు, ఎవరవుతారు అనేది చూడాలి. లోకేశ్‌ కనగరాజ్‌ DISCO ను స్ట్రయిట్‌గా అనౌన్స్‌ చేయడం లేదు అని అర్థమవుతోంది. అయితే దీనిపై మీద క్లారిటీ రావాలి అంటే మరో అనౌన్స్‌మెంట్‌ ఉండాలి.

అదెవరు అనేది ఎంత ఆసక్తికరమో, అసలు ఈ డిస్కో నిజమేనా అనేది కూడా అంతే ఆసక్తికరం. ఈ సినిమాలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా నటిస్తాడు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. నాగార్జున (Nagarjuna) అనౌన్స్‌మెంట్‌ నేపథ్యంలో ఆమిర్‌కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అన్నట్లు ఈ సినిమా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో భాగంగా ఉంటుందా అనే ప్రశ్న ఎలాగూ ఉంది. దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది.

 మీడియా ముఖంగా త్రివిక్రమ్ కి బండ్ల గణేష్ అపాలజీ .!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus