కథానాయికలకు కమర్షియల్ సినిమాలతో డబ్బులొస్తాయి. ఫేమ్ పెరగాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలి. అదే మంచి పేరు ప్లస్ డబ్బు రెండూ కావాలంటే మాత్రం బయోపిక్స్‌లో నటించాల్సిందే. ఒక్కోసారి అలాంటి పాత్రలు జీవితాంతం గుర్తుండిపోతాయి కూడా. అందుకే మన నాయికలు బయోపిక్స్‌లో కీ రోల్ పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా రష్మిక మందనను ఇదే విషయం అడిగితే… ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పింది. కథానాయికలకు వ్యక్తిగతంగా కొన్ని కలల పాత్రలు ఉంటాయి.
వాటి కోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తారు. ఆ అవకాశం వస్తే ఎన్ని త్యాగాలు చేసైనా ఓకే చేసేస్తారు. అలా రష్మికకు కూడా కొన్ని కలల పాత్రలున్నాయట. వాటిలో ఒకటి సౌందర్యలా నటించడం. ఎందుకంటే రష్మికకు ఇష్టమైన నాయికల్లో సౌందర్య ఒకరట. రష్మిక చిన్నప్పుడు కుటుంబ సభ్యులు ఆమెను సౌందర్యలా ఉంటావనేవారట. అందుకే ఆమె పాత్రలో నటించాలని ఉంది అని చెప్పింది రష్మిక. ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ అంతగా లేదు. ‘మహానటి’ తర్వాత వరుసగా అలాంటి సినిమాలు వస్తాయి అనుకున్నా…
ఆ తర్వాత ఎవరూ పెద్దగా ధైర్యం చేయడం లేదు. హిందీలో అయితే వరుసగా వస్తున్నాయి. దక్షిణాదిలోనూ పరిస్థితి తక్కువగా ఉంది. ఈ సమయంలో సౌందర్య బయోపిక్ చేయడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి. ఇప్పుడు రష్మిక చెప్పింది ఎవరైనా ఆ దిశగా ఆలోచించి చేస్తారేమో మరి.