Allu Arjun: అల్లు అర్జున్‌ మాటలో ఇంత మార్పు ఎందుకో?

పవన్‌ కల్యాణ్ అభిమానుల నుండి అల్లు అర్జున్‌ ఎదుర్కొన్న భారీ ట్రోల్‌… ‘చెప్పను బ్రదర్’. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ గురించి కూడా మాట్లాడండి అని అభిమానులు అదే పనిగా వారిస్తుంటే ‘నేను చెప్పను బ్రదర్‌’ అంటూ తెంపేశాడు అల్లు అర్జున్‌. దీంతో చాలా రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ – బన్నీ మధ్య ఏదో తేడా కొడుతోంది అంటూ వార్తలొచ్చాయి. దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. ఆ విషయం తెచ్చిన మార్పో, లేక ఇంకొకటో కానీ ‘అఖండ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీ చాలా జాగ్ర్తతగా ఉన్నాడు.

‘అఖండ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడటం మొదలు ‘జై బాలయ్య..’ అంటూ బాలకృష్ణ అభిమానులు నినాదాలు ప్రారంభించారు. దీంతో బన్నీ ఆఖరులో అంటా అంటూ దాటేశాడు. అనడం ఇష్టం లేదేమో అని అభిమానులు అనుకుంటుండగా… చెప్పాల్సిన మాటలు, ప్రాసలు అయిపోయాక బన్నీ ‘జై బాలయ్య’ అన్నాడు. దీంతో అభిమానులు తెగ ఆనందపడిపోయారు. బన్నీ ‘జై బాలయ్య’ అనడంతో మురిసిపోయారు. అయితే ఈ విషయంలో మెగా అభిమానులు కొంతమందికి రుచించడం లేదు.

పవన్‌ కల్యాణ్‌ విషయంలో అంత రచ్చ చేసిన బన్నీ… ఇప్పుడు ఎలా ‘జై బాలయ్య’ అంటాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి మరో వాదన కూడా ఉంది. బన్నీ పూర్తిగా బిజినెస్‌ మైండ్‌తోనే ‘అఖండ’ ఈవెంట్‌కి వచ్చాడని అంటున్నారు. డిసెంబరు 17న తన సినిమా ఉండటం, ‘ఆహా’లో బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ షో చేస్తుండటం లాంటి కారణాలతోనే అల్లు అర్జున్‌ అంతలా అభిమానుల మనసుల్ని గెలుచుకునే పని పెట్టుకున్నాడు అంటున్నారు. ఏదైతేముంది ‘జై బాలయ్య’ చర్చ రేపింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus