“సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం” లాంటి సినిమాల్లో అనసూయ ప్లే చేసిన పాత్రలు సూపర్ హిట్ అవ్వడంతో ఆమె మోస్ట్ వంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయింది. ముఖ్యంగా “రంగస్థలం”లో రంగమ్మత్తగా ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయిన మూవీ మేకర్స్.. అనంతరం చాలా పాత్రలకు ఆమెకు సంప్రదించారు. అనసూయ మాత్రం “ఎఫ్ 2” సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసి “కథనం” అనే సినిమాను సెలక్ట్ చేసుకొంది. “ఎఫ్ 2” సక్సెస్ క్రెడిట్ అనసూయకు ఏమాత్రం దక్కలేదు. ఇక మొన్న విడుదలైన “కథనం”కు కనీస స్థాయి కలెక్షన్స్ కూడా లభించకపోతుండడంతో.. రష్మీ రేంజ్ లో లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేయడం అనసూయకు అచ్చిరాలేదని స్పష్టమైంది.
దాంతో.. ఆల్రెడీ అంగీకరించిన, కథకు ఒకే చెప్పిన కొన్ని మహిళా ప్రధాన చిత్రాలను అనసూయ హోల్డ్ లో పెట్టిందట. “క్షణం, రంగస్థలం” తరహాలో ఏదైనా పెద్ద సినిమాలో కీలకపాత్ర పోషించడమే తనకు బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చేసింది అనసూయ. ఒకరకంగా చూసుకుంటే అది కూడా నిజమే. ఎందుకంటే అనసూయకు ఆడియన్స్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉండి ఉంటె కనీస స్థాయి ఓపెనింగ్స్ అయినా రావాలి. మరి అనసూయ తీసుకొన్న నిర్ణయం ఆమె ఫిలిం కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.