సినిమా పరిశ్రమలో ముందుగా ఓ హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఓ హిస్టారికల్, డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనుకుని.. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. అధికారికంగా ప్రకటించి.. ఆ తర్వాత పలు కారణాల వల్ల ప్రాజెక్టులు నిలిపేయడం.. అప్పటికే కోట్లలో నష్టపోవడం అనే సంఘటనలు చాలానే జరిగాయి.. అలా చిరంజీవితో అనుకున్న కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి.. వాటిలో ఓ దేశ భక్తి చిత్రం కూడా ఉంది.. అది కనుక చేసుంటో కచ్చితంగా చిరు కెరీర్‌లో ఓ స్పెషల్ ఫిలిం అయ్యేది..
ఇంతకీ ఏంటా సినిమా?.. దాని కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవికి ‘ఖైదీ’తో బ్రేక్ వచ్చిన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. దర్శక నిర్మాతల ఆయన కోసమే, ఆయణ్ణి దృష్టిలో పెట్టుకునే కథలు సిద్ధం చేసేవారు, చేయించేవారు.. ఆ తర్వాత ఎలాంటి సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్‌తో పాటు ప్రయోగాత్మకమైన చిత్రాలు చేశారో కొత్తగా చెప్పక్కర్లేదు..
2000వ దశకం ఆరంభంలో హిందీలో దేశ భక్తి నేపథ్యంలో చిత్రాలు చేయడం.. అవి ఘన విజయం సాధించడం అనే ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న టైంలో.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అలాంటి ఓ సినిమా చిరుతో చేద్దామనుకున్నారు.. భగత్ సింగ్ మీద అప్పటికే రెండు, మూడు సినిమాలు రావడంతో అలాంటిది చిరుకి సరిపోతుందని ఆయన ఆలోచన.. 2004 ఆగస్టు 15న ప్రారంభం అని కూడా చెప్పారు.. దాదాపు రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ అనుకున్నారు..
కట్ చేస్తే.. అప్పటి పరిణామాలు, ముఖ్యంగా భారీ వ్యయంతో తీసిన ‘అంజి’ ఫ్లాప్ అవడం చిరుని పునరాలోచనలో పడేశాయి.. దీంతో ఒక ప్రాంతీయ చిత్రానికి అంత ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి ప్రాజెక్ట్ ఆపేద్దామన్నారట మెగాస్టార్.. సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ముందు రీసెర్చ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా కాలాం వృథా చేశానని కృష్ణవంశీ బాధ పడినట్లు వార్తలు కూడా వచ్చాయి.. హీరో, దర్శకుడు ఎవరూ ప్రకటించ లేదు కానీ ఆ సినిమా అలా ఆగిపోయింది..