హీరోతో ఇబ్బందా? హీరోయిన్లు ఎందుకు ఇలా ఎగ్జిట్‌ అయిపోతున్నారు?

70 శాతం షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఏ సినిమా నుండైనా హీరోయిన్‌ బయటకు వచ్చేస్తుందా? రూ. 100 కోట్ల పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ నుండి కొత్త హీరోయిన్‌ అయినా తప్పుకుంటుందా? అందులోనూ ఆ హీరోతో సినిమా చేస్తే విజయం పక్కా, అవకాశాలు పక్కా అనే టాక్‌ ఉన్న సినిమాల నుండి హీరోయిన్స్‌ అలా బయటకు వచ్చేస్తారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా ‘నో’ అనే సమాధానమే వస్తుంది. కానీ టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. అవును దాదాపు ఒకే సమయంలో ఇద్దరు హీరోయిన్లు ఇలా బయటకు వచ్చేశారని టాక్‌.

Star Hero

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఓ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమా నుండి సీనియర్‌ హీరోయిన్‌ ఒకరు తప్పుకున్నారనేది ఆ వార్తల సారాంశం. సుమారు 70 శాతం చిత్రీకరణ పూర్తయిన ఆ సినిమా నుండి అమె అర్ధాంతరంగా తప్పుకున్నారు అని చెబుతున్నారు. దీంతో దాదాపు సినిమా చివరి దశకు వచ్చేసిన ఈ సమయంలో తప్పుకోవడం ఏంటి అనే చర్చ మొదలైంది. నిజంగా టీమ్‌ ఇస్తున్న లీకుల ప్రకారం డేట్స్‌ సమస్యనే కారణమా అని చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో అదే హీరో (Star Hero) పారలల్‌గా నటిస్తున్న మరో పాన్‌ ఇండియా సినిమా నుండి కూడా హీరోయిన్‌ ఎగ్జిట్‌ అయిపోయింది అని వార్తలొస్తున్నాయి. ఆరేళ్ల క్రితం రూ.6 కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా విడుదలై రూ.25 కోట్ల వసూళ్లతో భారీ చిత్రంగా మారిన సినిమాకు సీక్వెల్‌ అది. ఈసారి గత సినిమా వసూళ్లకు నాలుగు రెట్లు బడ్జెట్‌ పెడుతున్నారు. ఈ సినిమా కోసం ఓ విదేశీ భారతీయ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకొన్నారు. ఆమెనే వెళ్లిపోయింది.

అంతేకాదు.. లేటెస్ట్‌ సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఓ కథానాయిక ఇటీవల ఆ హీరో (Star Hero) ఆఫర్‌ను తిరస్కరించిందట. కారణమేంటా అని చూస్తే.. దర్శకత్వ విభాగంలో బాగా పట్టున్న ఆ హీరో.. సెట్స్‌లో అదే పనిగా నటనా ‘పాఠాలు’ చెప్పడమే అని తెలుస్తోంది. సీన్‌ సీన్‌కి ‘సుదీర్ఘ’ వివరణలు ఇస్తున్నాడట. ఆఖరికి ‘ఏడుపులందు రకములు వేరయా.. మన దగ్గర ఒక ఏడుపు, బాలీవుడ్‌లో ఒక ఏడుపు’ అని పాఠాలు చెబుతున్నాడట. ఇదంతా నచ్చకే నాయికలు.. ఇక చాలు అని వెళ్లిపోతున్నారని టాక్‌.

బఘీర తెలుగు ట్రైలర్.. పవర్ ఫుల్ డైలాగ్స్ తో స్టన్నింగ్ యాక్షన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus