Mahesh Babu: ‘బ్రహ్మోత్సవం’ టైంలో మర్చిపోయారు.. ‘సీతమ్మ వాకిట్లో’ రీ- రిలీజ్ కి గుర్తొచ్చినట్టుంది!
- March 16, 2025 / 09:00 AM ISTByPhani Kumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ పనులన్నీ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఏ కంటెంట్ ను ఎప్పుడు ఎంజాయ్ చేయాలో కూడా వాళ్ళకి అర్ధం కాదు అనుకుంట..! దీనికి చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే.. ‘ఖలేజా’ (Khaleja) సినిమా డిజాస్టర్ అని ప్రచారం చేసింది ముందుగా మహేష్ బాబు ఫ్యాన్సే. దానికి డివైడ్ టాక్ నడిచినా.. సరే డిజాస్టర్ అని ఆ సినిమాని తొక్కేసింది వాళ్లే. కానీ కట్ చేస్తే.. టీవీల్లో ఆ సినిమా అంతా బాగుందని చెప్పిన తర్వాత.. సోషల్ మీడియాలో దానికి కల్ట్ స్టేటస్ తగిలించారు మహేష్ బాబు ఫ్యాన్స్.
Mahesh Babu

అలాగే ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమా కి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వేశారు. దానికి కూడా టీవీల్లో, ఓటీటీల్లో కల్ట్ స్టేటస్ తగిలించారు. గత ఏడాది వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా విషయంలో కూడా అంతే..! ఆ సినిమా ప్లాప్ అని తిట్టిపోశారు. కానీ పండుగ సెలవులు కలిసొచ్చి అది బాగానే ఆడింది. తర్వాత అదే ఏడాది చివర్లో రీ రిలీజ్ చేయించుకుని ఎంజాయ్ చేశారు. అందుకే తమన్ కూడా ఒక సందర్భంలో ‘మహేష్ బాబు ఫ్యాన్స్ దేనిని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారో వాళ్ళకే తెలీదు’ అంటూ సెటైర్ విసిరాడు.

ఇక అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లలో వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో థియేటర్లలో ఓ బ్యాచ్ ‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) సినిమాలో చేసిన డాన్స్ మూమెంట్స్ ను రీ క్రియేట్ చేసి’ ట్రోల్ చేశారు. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ అయిన నెల రోజులకే ‘బ్రహ్మోత్సవం’ (Brahmotsavam) సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

ఆ సినిమాలో బాలా త్రిపుర మణి అనే పాటలో మహేష్ చేసిన డాన్స్ మూమెంట్స్ ని కూడా పవన్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సినిమా టైంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డాన్స్ మూమెంట్స్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం పనిగట్టుకుని ఆ డాన్స్ మూమెంట్స్ ను ట్రోల్ చేస్తుండటం గమనార్హం. వాటిని ప్రముఖ డిజిటల్ సంస్థలు కూడా షేర్ చేయడంతో మరింత హాట్ టాపిక్ అవుతుంది.
What’s the best edit of this sequence from #Sardargabbarsingh featuring @PawanKalyan you’ve seen so far?! pic.twitter.com/lp5he1jMcJ
— IMDb India (@IMDb_in) March 13, 2025














