నాగార్జున ఎందుకు రాలేదని గగ్గోలు స్టార్ట్‌ అవ్వలేదేంటో!

సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చారా లేదా… టీజరో, ట్రైలరో రిలీజ్‌ అయినప్పుడు ట్వీట్లు పెట్టారా లేదా అనేది చూసి బంధాలు, బంధుత్వాలను లెక్కేస్తున్న రోజులివి. ఫలానా హీరో సినిమా టీజర్‌ వచ్చింది… కానీ ఆయన వేలువిడిచిన బామ్మర్ది తమ్ముడి కొడుక్కి మామ అన్నయ్య కనీసం ట్వీట్‌ చేయలేదు అంటూ ఆరాలు తీస్తున్నారు. అయినా బంధాన్ని, అనుబంధాన్ని రోజూ ప్రదర్శించాలా… అంటే లేదనే చెప్పాలి. కానీ సినిమా వాళ్ల బంధాల గురించి చర్చలు మాత్రం తెగనడుస్తుంటాయి. ఈ క్రమంలో ఆ కుహనా విమర్శకులు ఇంకొకటి మరచిపోయినట్లున్నారు. అదే ‘లవ్‌ స్టోరీ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్.

నాగచైతన్య – సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. దానికి నాగచైతన్య తండ్రి నాగార్జున హాజరు కాలేదు. ప్రముఖ నటుడు చిరంజీవి, బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ విచ్చేశారు. మరి ఈవెంట్ల అటెండెన్స్‌ బట్టే… బంధాలు లెక్కేస్తుంటారు కదా. ఆ టాపిక్‌ను ఎందుకు బయటకు తీసుకురాలేదో. ఎందుకంటే వాళ్లకు వేరే టాపిక్‌ ఉంది కాబట్టి. నిజానికి ప్రతిఒక్కరూ తమ పనులతో బిజీగా ఉంటారు. వాటన్నింటినీ పక్కనపెట్టి ఆ ఈవెంట్‌కి ఈయన రాలేదు కాబట్టి… ఏదో ఉంది అనుకుంటే ఎలా.

సినిమాల తారల జీవితం గురించి తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తే ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ల ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారేలా మన చేతలు, రాతలు, మాటలు, కామెంట్లు ఉండకూడదు. గతంలోనూ టాలీవుడ్‌లో ఇలా ఈవెంట్లకు దగ్గరివాళ్లు గైర్హాజరు అయిన సందర్భాలున్నాయి. భవిష్యత్తులో కూడా వస్తాయి. అయినా ప్రతిసారి తారలు తమ ప్రేమను, బంధుత్వాన్ని నిరూపించుకోవాలా ఏంటి?

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video



‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus