ఆయన రాకముందు కూడా టాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కానీ అది తెలుగు ఆడియన్స్ కు మాత్రమే తెలుసు. కానీ వీటి గురించి ‘బాహుబలి’ తో ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేసాడు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఆయనే మన దర్శకధీరుడు రాజమౌళి. ఈయన పుట్టినరోజు నేడు. 1973 అక్టోబర్ 10న కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ లో జన్మించాడు రాజమౌళి. ఆయన ఈరోజుతో 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని టీవీ సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన రాజమౌళి… కథా మరియు స్క్రీన్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ కొడుకు అన్న సంగతి తెలిసిందే.
ఇక 19 ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆయన తీసిన సినిమాలు కేవలం 11 మాత్రమే. ఇప్పుడు చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ ఆయనకి 12 వ చిత్రం. ఎన్టీఆర్ తో రాజమౌళికి ఇది 4వ చిత్రం కావడం విశేషం. రాజమౌళి తన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెంబర్ 1’ ను ఎన్టీఆర్ తోనే చేశాడు. ఎన్టీఆర్ కి ఇదే మొదటి హిట్. ఇక 2 వ చిత్రం ‘సింహాద్రి’ కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఇక ఎన్టీఆర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ‘యమదొంగ’ ఇచ్చి ఆదుకుని. ఎన్టీఆర్ కెరీర్ ను నిలబెట్టాడు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్నాడు. వీరిద్దరూ అన్నదమ్ముల్లానే కలిసుంటారు. వీరి బంధం అలాంటిది మరి. ఇక రాజమౌళి పుట్టినరోజున ఆయనకీ ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట.