తెలుగు సినిమాల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన హీరోయిన్లు అంతా సినిమా ప్రచారంలో పాల్గొంటారు. వాళ్లెందుకు పాల్గొనరు అనేది పక్కనపెడితే.. వరుస పెట్టి ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు హాజరైన హీరోయిన్ ఇప్పుడు సినిమా ప్రచారాలు చేసిన ఓ హీరోయిన్ ఈవెంట్‌కి రాలేదు అంటే సమ్‌థింగ్ ఫిషీ అనొచ్చు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) . సూర్య (Suriya) ‘రెట్రో’ (Retro) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. దానికి పూజా హెగ్డే హాజరవ్వలేదు.
ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో ఇదే టాపిక్. సినిమా ప్రచారంలో యాక్టివ్ ఉండే పూజా హెగ్డే తెలుగు ఈవెంట్‌కి రాలేదు. ఈ విషయం గురించి సూర్య మాట్లాడుతూ ఏదో పని ఉండి రాలేదు అనేలా చెప్పారు. అయితే ఆమె రాకపోవడానికి కారణం అది కాదు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా అని అంటున్నారు. ఆ సినిమా విషయంలో జరిగిన పంచాయితీయే ఇప్పుడు రాకపోవడానికి కారణం అని చెబుతున్నారు. అప్పుడేమైందో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ సినిమాతో ఆ సినిమాకు లింకేంటి అని అనుకుంటున్నారా?
ఉంది.. దానికి కూడా ఓ కారణం ఉంది. ‘రెట్రో’ సినిమా ఈవెంట్‌ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీ (Suryadevara Naga Vamsi) దగ్గరుండి చూసుకున్నారు. అందుకే సినిమా టీమ్‌కు పూజా దూరంగా ఉంది అని చెబుతున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్ష్ – సితార ఎంటర్‌టైన్మెంట్స్ దాదాపు ఒక్కరివే. ‘గుంటూరు కారం’ సమయంలో జరిగిన పంచాయితీ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ టీమ్‌కి ఎదురుపడటం ఎందుకు అని పూజ రాలేదు అని చెబుతున్నారు.
ఇక ‘గుంటూరు కారం’ పంచాయితీ ఏంటి అనేది చూస్తే.. ఆ సినిమాలో తొలుత మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విజయాలు తగ్గడం, ఇతర కారణాల వల్ల సెకండ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను (Sreeleela) మెయిన్ హీరోయిన్‌ని చేసేశారు. ఎందుకు తీసేశారు అనేదానికి నిర్మాణ సంస్థ ఏదైనా చెప్పొచ్చు. కానీ ఏం జరిగిందో వారికే తెలుస్తుంది.
‘రెట్రో’ ని నాకంటే ఎక్కువగా పూజా హెగ్డే ప్రమోట్ చేసింది#Retro #Suriya #VijayDeverakonda #PoojaHegde #KarthikSubbaraj pic.twitter.com/dMpbmwI6MO
— Filmy Focus (@FilmyFocus) April 26, 2025