దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటుంటారు.. అప్ కమింగ్ ఆర్టిస్టులైతే కనీసం ఒక్క సీన్‌లోనైనా, ఫ్రేమ్‌లోనైనా కనిపిస్తే చాలు అనుకుంటూ ఉంటారు.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి.. ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన జక్కన్న ఇప్పటినుంచి చేయబోయే సినిమాలన్నీ హాలీవుడ్ స్టాండర్స్‌తో, ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కబోతున్నాయి.. అందుకు తగ్గట్టే వివిధ భాషలకు చెందిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఆయనతో పనిచేయనున్నారు..
ఇంతకుముందు రాజమౌళి సినిమాల్లో.. ముఖ్యంగా ‘బాహుబలి’ లో ఆఫర్ మిస్ చేసుకున్న యాక్టర్ల గురించి న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. తెలుగు వాళ్లకు, ముఖ్యంగా సీనియర్లకు వేషాలు ఇవ్వడం లేదని గతంలో సీనియర్ నటులు కోట, రంగనాథ్ వంటివారు కామెంట్స్ చేయడం.. ‘శివగామి’ క్యారెక్టర్ విషయంలో శ్రీదేవితో జరిగిన ఇష్యూ.. ఇటీవల సీనియర్ నటి కాంచన కామెంట్స్ చేయడం వంటివి చూశాం.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు రాజమౌళి సినిమాల్లో కనిపించరు? అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది..
మార్చి 23న జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివల పాన్ ఇండియా ఫిలిం NTR 30 ఓపెనింగ్‌కి వచ్చిన ప్రకాష్ రాజ్, జక్కన్న ఆత్మీయ ఆలింగనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు.. అప్పుడు వారి సాన్నిహిత్యం చూసి ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ లో 5 నిమిషాల పాటు కనిపించే పోలీస్ క్యారెక్టర్ చేశారు..
అంతకుముంద కానీ ఈ తర్వాత కానీ ఏ సినిమాలోనూ కనిపించలేదు.. దీని గురించి జక్కన్నను అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.. ‘‘ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్(Prakash Raj) చెయ్యని క్యారెక్టర్ లేదు.. మనం ఆయణ్ణి అన్ని రకాల పాత్రల్లోనూ చూసేశాం.. ఆయన మళ్లీ నా సినిమాలో కూడా అలాంటి పాత్రే చేస్తే చూసే జనానికి బోర్ కొడుతుంది.. ఆయన ఇంతవరకు చేయని పాత్ర ఏదైనా వచ్చినప్పుడు నేనే చెప్పి ఆయనతో నా సినిమాలో చేయించుకుంటా’’ అని చెప్పారు..