Pushpa Movie: ఈ విషయంలో ‘ఆర్.ఆర్.ఆర్’ టీంని ఫాలో అవ్వడం లేదేంటి?

విడుదల తేదీకి దాదాపు నెలరోజులు ఉండగానే బాలీవుడ్లో ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేయడానికి ‘ఆర్.ఆర్.ఆర్’ టీం రెడీ అయ్యింది. అలియా భట్, అజయ్ దేవగన్ లను అడ్డం పెట్టుకుని అక్కడ భారీ ప్రమోషన్లు చేయించుకోవడానికి రాజమౌళి ఎప్పుడో స్కెచ్ లు వేసాడు. సినిమా హిట్టయితే టాలీవుడ్ ను మించి బాలీవుడ్లో కలెక్షన్లు వస్తాయి కాబట్టి.. రాజమౌళి మొదటి నుండీ అక్కడ ఫోకస్ పెట్టాడు. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లు భారీగా చేయకపోయినా భారీ కలెక్షన్లు రావడం మాత్రం గ్యారెంటీ.

ఎందుకంటే బాలీవుడ్లో కూడా ‘బాహుబలి’ తో టాప్ ప్లేస్ ను సంపాదించుకున్నాడు రాజమౌళి.పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం బాలీవుడ్ కూడా ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మొన్నటివరకు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ‘పుష్ప’ టీం కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది. వాళ్ళు 45 సెకండ్ల గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తే వీళ్ళు కూడా అదే విధంగా గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ ఈవెంట్ దుబాయ్ లో కండక్ట్ చేస్తుంటే.. వీళ్ళు కూడా దుబాయ్ లో కండక్ట్ చేయడానికి రెడీ అయ్యారు.

అయితే రెండు ఈవెంట్ లు క్యాన్సిల్ అయ్యాయి లెండి. అయితే బాలీవుడ్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ‘పుష్ప’ టీం ఏమాత్రం జోరు చూపించడం లేదు. పైగా ‘పుష్ప’ విడుదలకి తిప్పి కొడితే వారం రోజులు మాత్రమే టైం ఉంది. అక్కడి క్రిటిక్స్ తో ట్వీట్లు వంటివి వేయిస్తున్నారు తప్ప.. అక్కడికి వెళ్లి ప్రమోషన్లు చేసే ఆలోచన ‘పుష్ప’ టీంకి ఉన్నట్టు కనిపించడం లేదు. అలా అయితే అక్కడ ‘పుష్ప’ కి మినిమం ఓపెనింగ్స్ నమోదవ్వడం కూడా కష్టమనే చెప్పాలి.

ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో సునీల్, అనసూయ,అజయ్, ధనుంజయ, ఫహాద్ ఫాజిల్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అల్లు అర్జున్- సుకుమార్ కంబినేషన్లో రూపొందుతోన్న మూడవ చిత్రమిది. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus