Rajamouli: జక్కన్న సైలెన్స్ కు అసలు కారణమిదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమ్ పాత్రకు సంబంధించిన లుక్ విడుదలైంది. లుక్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఆర్ఆర్ఆర్ టీమ్ పోస్టర్ విడుదల చేయడంపై తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమ్ పోస్టర్ తో పాటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. అయితే రాజమౌళి మాత్రం రిలీజ్ డేట్ గురించి చెప్పడానికి సాహసించలేదు.

ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడగా కరోనా సెకండ్ వేవ్ వల్ల మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడటం గ్యారంటీ అని తెలుస్తోంది. కుదిరితే 2022 సంక్రాంతికి లేదా 2022 సమ్మర్ కు ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయినట్టు సమాచారం. దాదాపు రెండు నెలల షూటింగ్ జరగాల్సి ఉండగా లాక్ డౌన్ పూర్తైతే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టాలని రాజమౌళి భావిస్తున్నారని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆ డేట్ కు సినిమాను రిలీజ్ చేయలేకపోతే

మళ్లీ విమర్శలు తప్పవని షూటింగ్ పూర్తయ్యే వరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకూడదని భావించి జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా పోస్టర్ మినహా మరే అప్ డేట్ ఉండదని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం అటు చరణ్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus