Ram Charan: చరణ్‌ టీమ్‌ అవుట్‌డేటడ్‌ ఆలోచనలంటూ నెటిజన్లు ఫైర్‌!

అభిమాన హీరో గురించి సోషల్‌ మీడియాలో ఏం వచ్చినా.. తెగ సంబరపడిపోతుంటారు ఫ్యాన్స్‌. అందులోనూ ఆ హీరో సోషల్‌ మీడయా అకౌంట్‌లోనే ఆ విషయం వస్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే మా హీరో అలా చేశాడు, మా హీరో ఇలా చేశాడు అంటూ తెగ రీట్వీట్‌లు, రీపోస్ట్‌లు చేస్తుంటారు. ఈ క్రమంలో దాని కింద కామెంట్స్‌లో ఏమన్నా ఇబ్బందికరమైనవి ఉంటే.. తిట్లు, కోపాలు కనిపిస్తాయి. తాజాగా రామ్‌చరణ్‌ నుండి వచ్చిన ఓ వీడియో ఇప్పుడు దీనికి వేదికవుతోంది. అయితే దీనికి కారణం అతని టీమ్‌ అని తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ఓ వీడియో కనిపించింది. అన్‌కన్వెన్షనల్‌ జిమ్‌లో రామ్‌ చరణ్‌ ఎక్సర్‌సైజ్‌లు అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. బండరాళ్లు, వైర్లు, కర్రలు, ఇనుపరాడ్లు, బండలు మాత్రమే ఉన్న ఓ ప్రదేశంలో ఓ వ్యక్తితో కలసి రామ్‌చరణ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న వీడియో అది. నిజానికి ఆ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. జిమ్‌ చేయాల్సిందే, ఆరోగ్యంగా ఉండాల్సిందే అంటూ చెప్పేలా ఆ వీడియో సిద్ధం చేశారు. అయితే ఆ వీడియో పోస్ట్‌ చేసిన టైమ్‌ విషయంలోనే సమస్య అని చెప్పాలి.

దాంతోపాటు ఆ వీడియోతో రాసుకొచ్చిన విషయం కూడా అలాగే ఉంది. రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా చిత్రీకరణ త్వరలో న్యూజిలాండ్‌లో మొదలవుతుంది. దాని సన్నద్ధత కోసం రామ్‌చరణ్‌ ఇలాంటి ప్రదేశంలో, సరైన వసతులు లేకపోయినా కష్టపడుతున్నాడు అని రాశారు. నిజానికి రామ్‌చరణ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. మొన్నీమధ్య సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించడానికి వచ్చాడు కూడా. త్వరలో న్యూజిలాండ్‌ వెళ్తాడట. ఆ లెక్కన రిలీజ్‌ చేసిన వీడియో పాతది. ఇంతకుముందు విదేశీ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు చిత్రీకరించింది అయి ఉండాలి. ఎందుకంటే ఆ వీడియోలో కనిపిస్తున్న ప్లేస్‌ మన దేశం కాదు.

అలాంటప్పుడు న్యూజిలాండ్‌ షెడ్యూల్‌కి, ఈ వీడియోకి ఏం సంబంధం. ఏదో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి కాబట్టి లింక్‌ లేకుండా రాశారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ లింక్‌ లేకుండా నేరుగా ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎక్సర్‌సైజ్‌ చేయడం చరణ్‌ డెడికేషన్‌కి నిదర్శనం అని రాసి ఉంటే సరిపోయేది కదా అని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ పోస్ట్‌ విషయంలో చరణ్‌ టీమ్‌ పప్పులో కాలేసిందా అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియా యుగంలో ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా చరణ్‌.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus