ఆస్కార్ అవార్డుని ఇండియన్ సినిమా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. ఈ ఏడాది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‘(RRR) చిత్రం ఆస్కార్ కు వెళ్లాలని అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి సూపర్ హీరోల పాత్రలతో తెరకెక్కించిన సినిమా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాంటి ఈ సినిమా ఇండియా తరపున ఆస్కార్ కు వెళ్లాలని అంతా కోరుకున్నారు.
అయితే ఇండియా తరపున ‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్ళలేదు.అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో తెలీని గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ ని ఆస్కార్ నామినేషన్స్ కు పంపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఆస్కార్ కు వెళ్లకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా ఆస్కార్ అవార్డులు ఇచ్చేది తెల్లవాళ్లుగా పిలవబడే ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళు ఓ ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటే..
అందులో హీరో దరిద్రుడు అయ్యి ఉండాలి లేదా ఆ కథ మొత్తం దరిద్రం చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకే ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ వంటి చిత్రాలకు ఆస్కార్ లభించింది. మన ‘ఆర్.ఆర్.ఆర్’ ను చూసుకుంటే తెల్లవాళ్లను ఇద్దరు మహావీరులు చమటలు పట్టించి మరీ హతమార్చినట్టు ఉంది. ఇలాంటివి చూసి ఇంగ్లీష్ వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళ కడుపు ముండదు. అలాగే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి గొప్ప వీరుల లక్ష్యం ఏంటి? తెల్లవాళ్లను తమ దేశం నుండి వెళ్లగొట్టడం, తమ ప్రజలను బానిసత్వం నుండి విడిపించడం.
అలాంటి గొప్ప వీరుల కథాంశంతో తీసిన సినిమాకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చే ఆస్కార్ అవార్డు కావాలా. అది సరైన ట్రిబ్యూట్ అనిపించుకోదు. ఆస్కార్ కొట్టిన అవార్డులు అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయా? అంటే అవునని చెప్పలేము. అవార్డు వచ్చినంత మాత్రాన సినిమా గొప్పతనం పెరుగుతుందా?సినిమా అనేది ఎంతో మంది కడుపు నింపేది. ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆస్కార్ వచ్చినా రాకపోయినా.. రాజమౌళి తీసే సినిమాలు అంటే జనాలు ఎగబడి చూస్తారు. అందులో డౌట్ లేదు. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ అభిమానులు ఇవి మైండ్లో పెట్టుకుని హ్యాపీగా ‘నాటు నాటు’ పాట చూస్తూ సంతృప్తి చెందితే సరిపోదా.?