తెలుగులో కార్తీ (Karthi) మొదటి చిత్రంగా ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) రిలీజ్ అయ్యింది. దీనికి ముందు తమిళంలో అతను మరో సినిమా చేసిన సంగతి తెలిసిందే. అది ఇక్కడ లేట్ గా రిలీజ్ అయ్యింది. అయితే సెల్వరాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా బాగా ఆడింది. ‘రేయ్ ఎవర్రా మీరంతా?’ అంటూ కార్తీ పలికిన డైలాగ్ పై ఇప్పటికీ బోలెడన్ని మీమ్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్లు రీమాసేన్ (Reema Sen), ఆండ్రియా (Andrea Jeremiah) ..ల గ్లామర్ కూడా సినిమాకు హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి నేటితో 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న టెక్నాలజీని కరెక్ట్ గా వాడుకుని తీస్తే సీక్వెల్ నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఎటువంటి అప్డేట్ లేదు.
ఈ క్రమంలో ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ ఏమైంది? ఆగిపోయిందా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం సెల్వ రాఘవన్..”మొదటి భాగానికి మించిన కొత్త పాత్రలు, మరింత డీప్ కథాంశం ఉంటుంది. వాటికి న్యాయం చేసే నటీనటుల ఎంపిక చాలా అవసరం. కాబట్టి అందుకు టైం పడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే కార్తీ బదులు ధనుష్ తో ఈ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా సెల్వ రాఘవన్ తెలిపారు.
ఇలా సెల్వ రాఘవన్ చెప్పి కూడా రెండేళ్లు దాటింది. అయినా సరే ‘యుగానికి ఒక్కడు’ గురించి ఎటువంటి చప్పుడు లేదు. బహుశా నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల.. ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.