గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ మొదలు పెట్టిన ‘#Kill FakeNews ఉద్యమానికి … ఇండస్ట్రీ నుండీ మద్దతు లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. విజయ్ దేవరకొండ కు మేమున్నాం అంటూ… మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘కింగ్’ నాగార్జున … దర్శకుడు కొరటాల శివ, సుకుమార్ వంటి వారు మద్దతు పలుకుతూ ముందుకు వచ్చారు. ‘నేను మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో ట్రస్ట్ ను పెట్టి… దానికి వచ్చిన ఫండ్స్ తో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి… నిత్యావసరలా ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించాలి అనుకున్న విజయ్ పై ఫేక్ న్యూస్ లు వేసి…
అతన్ని బ్యాడ్ చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారు అంటూ ఓ మీడియా పై విజయ్ ఆగ్రహం చూపించాడు.అందుకు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అంతా ముందుకు వచ్చి తనకు మద్దతు ఇస్తున్నారు. కానీ 2018 లో పవన్ కళ్యాణ్ కూడా .. తనని టార్గెట్ చేసి కొన్ని ఛానల్స్ వారు అతని పరువు తియ్యాలి అని ప్రయత్నిస్తున్నారు అంటూ మా ఆఫీస్ వెళ్ళి మరీ ఫిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ మరియు అతని తల్లి గురించి ఎంతో ఘోరంగా మాట్లాడిన వారి గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏ సెలబ్రిటి కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఎంతో మంది మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని తన పై అసత్య ప్రచారం చేస్తూ నా పరువు తీస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజానికి ఇప్పుడైనా ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చి విజయ్ కు అండగా నిలబడడం మంచి పరిణామమే కానీ… పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకుని క్యాష్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కనీసం అప్పుడు రెస్పాండ్ కాలేదు. ‘విజయ్ కు ఇంతలా స్టార్ హీరోలు సైతం ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం వెనుక ఏదో జరుగుతుంది’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.