పుష్ప 2 సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా థమన్‌ను (S.S.Thaman) తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. థమన్ మాట్లాడుతూ, “పుష్ప 2 (Pushpa2) కోసం మూడు రీల్స్‌కే బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాను.
Pushpa 2
ఇది హీల్తీ వర్క్ స్టైల్ కాదని నాకు తెలుసు. గతంలో కూడా నేను ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకే సినిమాకి పని చేయడం సరైనది కాదని చెప్పాను. అయితే, బన్నీ వ్యక్తిగతంగా పిలిచి ‘పుష్ప 2’కి పని చేయమని అడిగారు. ఆయనతో నా రిలేషన్‌షిప్, గతంలో పనిచేసిన ‘సరైనోడు (Sarrainodu) ,’ ‘రేసు గుర్రం,(Race Gurram) ’ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) వంటి హిట్ చిత్రాలు మా మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పరచాయి. అందుకే నేను ఈ సినిమా కోసం పని చేయడానికి ఒప్పుకున్నాను,” అని తెలిపారు.
పుష్ప 2 బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం థమన్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ” ఇద్దరం స్నేహపూర్వకంగా, కోఆర్డినేషన్‌తో ఈ ప్రాజెక్టుపై పని చేశాము. నిర్మాణ బృందానికి మంచి అవుట్‌పుట్ అందించడమే మా ఉద్దేశ్యం,” అని థమన్ అన్నారు. థమన్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ మణిశర్మ (Mani Sharma) దగ్గర శిష్యరికం చేశారు. వారిమధ్య అయితే మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా ఆరంభంలో వచ్చే మూడు రీల్స్‌కి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పుష్ప 2 ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే ఊహించని రేంజ్ లో జరిగినట్లు మేకర్స్ తెలిపారు. ఇక తప్పకుండా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.