అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. అషిషోర్ సాల్మన్ అనే రైటర్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ లు కలిసి నిర్మించారు. ఏప్రిల్2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా హీరోయిన్ గా నటించింది. నాగార్జున నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.కానీ బాక్సాఫీస్ దగ్గర ‘వైల్డ్ డాగ్’ సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి.
‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.13 cr
సీడెడ్
0.39 cr
ఉత్తరాంధ్ర
0.41 cr
ఈస్ట్
0.24 cr
వెస్ట్
0.17 cr
గుంటూరు
0.22 cr
కృష్ణా
0.23 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.13 cr
ఓవర్సీస్
0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.33 cr
‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 3.33 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 6.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈరోజు ‘వకీల్ సాబ్’ కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కాబట్టి ‘వైల్డ్ డాగ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి.