Anil Ravipudi: అనిల్ రావిపూడి రిక్వెస్ట్.. దిల్ రాజు కరుణిస్తాడా..?
- October 22, 2024 / 06:06 PM ISTByFilmy Focus
సంక్రాంతి సీజన్లో ఏ సినిమా రిలీజ్ అయినా.. దానికి మంచి వసూళ్లు వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఏ పండుగనైనా సినిమాతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి సీజన్లో అయితే మరీను. టాక్ తో సంబంధం లేకుండా ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. సాధారణంగా కొన్ని సినిమాలు సంక్రాంతికి వస్తే.. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేవి అని అంతా అనుకుంటారు. ఈ లిస్ట్ లో అనిల్ రావిపూడిని ఎక్కువగా చెప్పుకోవాలి.
Anil Ravipudi

ఎందుకంటే, అతని గత సినిమాలు ‘ఎఫ్ 3’ ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) .. వంటి వాటికి పాజిటివ్ టాక్ వచ్చాయి. కానీ అవి సంక్రాంతి సీజన్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే భారీ వసూళ్లు రాబట్టేవి అనేది అతని ఆలోచన. ఈ విషయాన్ని పలుమార్లు తన స్నేహితుల వద్ద పంచుకున్నాడట అనిల్ రావిపూడి (Anil Ravipudi) . అది పక్కన పెడితే.. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో (Venkatesh) ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో రూపొందుతున్న మూవీ ఇది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)..లు హీరోయిన్లు.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసి ఈ చిత్రం షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. అయితే జనవరి 10 న రాంచరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం రిలీజ్ అవుతుంది. దీనికి కూడా నిర్మాత దిల్ రాజే..! అలాంటప్పుడు అనిల్ (Anil Ravipudi) -వెంకీ ..ల సినిమాని సంక్రాంతికి దింపడం అనేది అంత ఈజీ కాదు. థియేటర్ల సమస్య పక్కన పెడితే.. ‘తన సినిమా కలెక్షన్స్ ని తన సినిమాతోనే దెబ్బ కొట్టుకున్నట్టు అవుతుంది’.. దిల్ రాజుకి.

అయినప్పటికీ దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టడంతో జనవరి 14న అనిల్-వెంకీ..ల సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ చూస్తారు. అలా చూసుకుంటే ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 కి, బాలకృష్ణ (Balakrishna) – బాబీ (K. S. Ravindra) ..ల సినిమా జనవరి 12 కి, జనవరి 11 లేదా 13 కి అజిత్ ‘గుడ్ బాడ్ అగ్లీ’ వస్తుంది. సో 4వ సినిమాగా వెంకీ- అనిల్ ..ల సినిమా జనవరి 14న రంగంలోకి దిగొచ్చు.
















