ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాలలో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటి. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతుండగా ఈ సినిమా బయ్యర్లకు కచ్చితంగా మంచి లాభాలను అందిస్తుందని బాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. మరి బడ్జెట్ కు సమాన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేమని వినిపిస్తోంది.
యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. తారక్ ఈ సినిమాకు సంబంధించి పార్క్ హయత్ లో జరిగిన ఈవెంట్ లో పాల్గొనడంతో తారక్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణ్ బీర్, అలియా భట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ సీజన్6 తెలుగులో పాల్గొన్న సంగతి తెలిసిందే. రణ్ బీర్ తెలుగులో మాట్లాడగా అలియా భట్ తెలుగు, హిందీలో పాటలు పాడి మెప్పించారు.
గర్భవతి అయినప్పటికీ అలియా భట్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.
ఈ సినిమాకు టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లు దక్కుతున్నాయని తెలుస్తోంది. అయితే అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.