Devara: ‘దేవర’ టీం.. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టేస్తుందా..?!

సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసే ‘క్యూ అండ్ ఎ’ లు నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.’సినిమా జర్నలిస్టులు అంతా ఒకచోట చేరి మూవీ టీంని అడిగే ప్రశ్నలు.. అందుకు మూవీ టీం చెప్పే సమాధానాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయితే తమ సినిమాకు బాగా పబ్లిసిటీ వస్తుంది’ అని భావిస్తున్నారు నిర్మాతలు. అయితే సినిమా గురించి.. ముఖ్యంగా దాని కంటెంట్ గురించి ప్రశ్నలు అడిగేవారు రోజురోజుకీ తక్కువయిపోతున్నారు.

Devara

‘అటెన్షన్ సీకర్స్’ .. అంటే కాంట్రోవర్సీ టాపిక్స్ తీసుకుని.. సదరు సినిమా టీంలని ఇబ్బంది పెట్టి హైలెట్ అయిపోదాం అనుకునే బ్యాచ్ అనమాట. రోజు రోజుకీ వీళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంకొంతమంది అయితే సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్న వారి పక్కన కూర్చుని వాళ్ళ వైపు వింతగా చూసి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం.. ఆ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వైరల్ అయిపోదాం అనుకుంటున్నారు. ఇలాంటి చేష్టలు సినిమా యూనిట్లని ఇబ్బంది పెడుతున్నాయట. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి ఈ ‘క్యూ అండ్ ఎ’ లు కచ్చితంగా అవసరం.

కానీ పెద్ద సినిమా యూనిట్లు మాత్రం వీటికి నో చెబుతున్నాయట. అందులో ‘దేవర’ (Devara) టీం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ‘ఐటీసీ కోహినూర్’ అనే 5 స్టార్ హోటల్లో ‘దేవర’ టీం ‘క్యూ అండ్ ఎ’ నిర్వహించాలి అనుకుంది. కానీ అది కండక్ట్ చేస్తే.. ‘ఎన్టీఆర్..ని (Jr NTR)  బాలయ్య (Balakrishna)  గురించి,అలాగే నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కాంట్రోవర్సీ క్వశ్చన్లు అడుగుతారేమో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి ఎలాంటి వాటికి దారితీస్తాయో’ అని ఎన్టీఆర్ టీం నో చెప్పిందట.

ఇక దర్శకుడు కొరటాల (Koratala Siva) కూడా ‘ఆచార్య (Acharya)గురించి చిరంజీవి  (Chiranjeevi) గురించి కాంట్రోవర్సీ ప్రశ్నలు ఎదురవుతాయేమో’ అని భావించి నో చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే 22న ఒక్క ప్రీ రిలీజ్ తో సరిపెట్టేయాలని ‘దేవర’ టీం ఆలోచనగా స్పష్టమవుతుంది.

537 పాటలు 27 వేల సెప్పులు.. గిన్నీస్ బుక్ ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus