యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు కొన్నేళ్ల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సైతం తారక్ తో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు. తారక్ వార్2 సినిమాలో నటిస్తుండటంతో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (RRR) ఆర్.ఆర్.ఆర్ సినిమా బాలీవుడ్ లో తారక్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అయితే దేవర సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
దేవర (Devara) సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దేవర1 హిందీ గ్లింప్స్ కు ఏకంగా 23 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. దేవర హిందీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర గ్లింప్స్ ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో సినిమా అంతకు మించి సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
బాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసే తెలుగు సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కొరటాల శివ (Koratala Siva) సైతం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం. దేవర సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర1 ఈ ఏడాది రిలీజ్ కానుండగా ఈ సినిమా రిజల్ట్ ఆధారంగా దేవర2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఏ సినిమాకు కష్టపడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథలకు ఓటేస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి బాలీవుడ్ స్టార్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు.