ప్రభాస్ (Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ..ల కలయికలో రూపొందిన ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పురాణాలకి ముడిపెడుతూ దీనిని ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు ప్రియాంక దత్ (Priyanka Dutt) , స్వప్న దత్(Swapna Dutt)..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్.. వంటివి పాస్ మార్కులు అయితే వేయించుకున్నాయి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
2898 సంవత్సరంలో జరగబోయే కథ ఇది అని… ముందుగానే క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. భవిష్యత్తులో డబ్బు.. యూనిట్స్ గా ఉంటుందని.. వివరించారు. కానీ ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందా.. నచ్చడం పక్కన పెట్టి ముందుగా అర్ధమవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ప్రభాస్ ఓ మాస్ కటౌట్. అలాంటి కటౌట్ తో ‘బాహుబలి’ (Baahubali) ‘సలార్’ (Salaar) వంటి సినిమాలు చేస్తే తిరుగుండదు.
కానీ ‘కల్కి 2898 ad’ వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఆ కటౌట్ కి సెట్ అవుతాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ప్రభాస్ వంటి కటౌట్ ని పెట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్ ని చూస్తూ ఎంజాయ్ చేయాలని మాస్ ఆడియన్స్ అనుకుంటారు కానీ.. ఈ యూనిట్స్, కాంప్లెక్స్ అంటూ వారి మెదడుకి పని చెప్పాలని అనుకోరు కదా.?
సో మాస్ ఆడియన్స్ ‘కల్కి 2898 ad ‘ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే దానిపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. లేదంటే.. ప్రభాస్ కెరీర్లో, అశ్వినీదత్ కెరీర్లో.. ఓ కాస్ట్ లీ ఎక్స్పెరిమెంట్ లా మిగిలిపోతుంది. జూన్ 27 కి రిజల్ట్ ఏంటనేది తేలిపోతుంది..! ‘వెయిట్ అండ్ సి’..!