మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి అంచనాలకు మించి హిట్ గా నిలిచింది. చిరంజీవి రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మాస్ రోల్స్ కంటే ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆయన సినిమా 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కష్టం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న కథతో చిరంజీవి సినిమా తెరకెక్కితే ఆ సినిమా కచ్చితంగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేయడం గమనార్హం. సరైన సినిమా పడితే చిరంజీవి రేంజ్ కు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు చాలా తేలిక అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి అలాంటి కథలను ఎంచుకుని రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంటాయో చూడాలి. చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
చిరంజీవి పారితోషికంగా ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో మరెవరికి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కడం లేదు. చిరంజీవి ప్రతిభ ఉన్న నటుడు కావడంతో ఆయన సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం, టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో నిర్మాతలు సైతం ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.