నాగార్జున గత సినిమా ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు ఒకింత భారీ షాకిచ్చిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. దాదాపుగా ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న నాగార్జున తర్వాత సినిమాల విషయంలో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే నాగార్జున కెరీర్ పరంగా వచ్చిన గ్యాప్ కు సంబంధించిన సరైన సమాధానం ఇవ్వడానికి ఎంతో సమయం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నా సామిరంగ మూవీ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. విజయ్ బిన్నీ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ బిన్నీ కెరీర్ ను ఈ సినిమా (Naa Saami Ranga) మలుపు తిప్పుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగార్జున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలానాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగ్ రేంజ్ ను పెంచే సినిమా నా సామిరంగ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నా సామిరంగ సినిమా సంక్రాంతి టార్గెట్ గా షూట్ జరుపుకుంటుండగా మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నా సామిరంగ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించిన మెజారిటీ సందర్భాలలో విజయాలు దక్కాయి.
ఇతర భాషల్లో నాగార్జునను అభిమనించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. నాగార్జున క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ షో నాగ్ రేంజ్ ను మరింత పెంచింది. నాగ్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.