గిల్డ్‌లో ఏం జరుగుతోంది… చిత్రీకరణలు స్టార్ట్‌ చేసేస్తారా…

తెలుగు సినిమా నిర్మాతలు అందరూ కలసి (?) చిత్రీకరణలు నిలిపేసిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని తేల్చుకోవడానికి ఈ బంద్‌ అన్నారు. అయితే ఈ బంద్‌కి ఫుల్‌ స్టాప్ పెట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దానికి కారణం యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సభ్యుల ఆలోచనల్లో మార్పులు వస్తుండటమే అని అంటున్నారు. ‘మీరు షూటింగ్‌లు చేసుకుంటున్నారు.. మేం చేసుకోకూడదా?’ అనే ప్రశ్న అంతర్గతరంగా వినిపిస్తుండటమే కారణం అని అంటున్నారు.

నిర్మాతలు బంద్‌ ప్రకటించినా.. ‘వారసుడు’, ‘సార్‌’ సినిమాలతోపాటు మరికొన్ని సినిమాల చిత్రీకరణలు టాలీవుడ్‌లో జరుగుతున్నాయి. దానికి ఎవరెన్ని కారణాలు చెప్పినా.. షూటింగ్‌లు అయితే అవుతున్నాయి అనేది పక్కా. దీంతో కొంతమంది నిర్మాతలు మేం కూడా స్టార్ట్‌ చేసేస్తాం అని అంటున్నారట. సెట్స్‌ వేసేశాం, వడ్డీలు పెరుగుతున్నాయి, కాల్‌షీట్లు మళ్లీ కష్టం లాంటి కారణాలతో నిర్మాతలు రీస్టార్ట్‌ ఆలోచన చేస్తున్నారని టాక్‌. అయితే ఎవరు ముందు స్టార్ట్‌ చేస్తారు అనేది చూడాలి.

నాని హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘దసరా’ సినిమా చిత్రీకరణ సోమవారం నుండి షురూ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆపి తన నిర్మాతకు నష్టం కలగనివ్వనని హీరో నాని తనను కలిసిన గిల్డ్ ప్రతినిధుల దగ్గర అన్నారట. దాంతోపాటు మరికొంతమంది నిర్మాతలు కూడా తన సినిమా రీస్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. స్టూడియోల్లో వేసిన సెట్‌ల ఛార్జీలు లేకుండా చూస్తామని గిల్డ్‌ సభ్యులు అంటున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.