Shruti, Santanu: వరుస సినిమాలు.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం శృతిహాసన్.. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ లో ఉంది. అతడినే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. శృతిహాసన్ వయసు 36 సంవత్సరాలు. ఆమె తోటి హీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కాజల్ అయితే పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ 28 ఏళ్లకే పెళ్లి చేసుకొని తల్లయింది. మరోపక్క తన కెరీర్ ని కూడా కంటిన్యూ చేస్తుంది. దీంతో ఇప్పుడు శృతిహాసన్ కూడా పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఎప్పుడూ కూడా తన రిలేషన్ షిప్ ను దాచిపెట్టలేదు. శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ఇదివరకే ఈమె వెల్లడించింది. అంతేకాదు.. ముందుగా తనే శాంతనుకి ప్రపోజ్ చేసినట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి రెడీ అవుతుందని సమాచారం.

అయితే ప్రస్తుతం శృతిహాసన్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఈ సంక్రాంతికి ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’. ఈ రెండూ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ప్రస్తుతం శృతి.. ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె పెళ్లికి ఓకే చెబుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలపై శృతిహాసన్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus