రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో ప్రతిభ ఉన్న రచయిత అనే సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి సక్సెస్ లో విజయేంద్ర ప్రసాద్ కు కూడా పాత్ర ఉంది. అయితే విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళితో పాటు ఇతర డైరెక్టర్లకు కూడా కథలు అందిస్తారు. విజయేంద్ర ప్రసాద్ కు పురాణాలతో పాటు వేర్వేరు అంశాలపై ఎంతో జ్ఞానం ఉంది.
ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో అలాంటి కథలనే విజయేంద్ర ప్రసాద్ రాస్తారని ఇండస్ట్రీలో పేరుంది. రాజమౌళితో పని చేయాలనే కోరిక చాలామంది హీరోలకు ఉన్నా రాజమౌళి అందరు హీరోలతో సినిమాలను తెరకెక్కించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అయితే విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన భజరంగీ భాయిజాన్ భాషతో సంబంధం లేకుండా హిట్ గా నిలిచింది. రాజమౌళి తండ్రి కథలతో సినిమాలను తెరకెక్కిస్తే కూడా చాలావరకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
విజయేంద్ర ప్రసాద్ దగ్గర కథలు తీసుకొని టాలెంట్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో స్టార్ హీరోలు నటిస్తే బాగుంటుందని టాలీవుడ్ స్టార్స్ ఈ దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సొంతంగా కథలు రాసుకోలేని డైరెక్టర్లు సైతం విజయేంద్ర ప్రసాద్ పై దృష్టి పెడితే మంచిది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు కొంతమందే ఉన్నారు. కొందరు డైరెక్టర్లకు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్నా కథల విషయంలో సమస్య ఎదురవుతోంది.
ఎనిమిది పదుల వయస్సులో కూడా విజయేంద్ర ప్రసాద్ ఈతరం ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే కథలను రాస్తుండటం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ ప్రతిభకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫిదా అవుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా కూడా సక్సెస్ సాధించి ఉంటే బాగుండేదని మరి కొందరు భావిస్తున్నారు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!