యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గత రెండేళ్లుగా భారీ నిరాశ ఎదురవుతుంది. వాళ్ళు 2019 వేడుకలతో పాటు 2020 పుట్టిన రోజు వేడుకలు కూడా మిస్ అవుతున్నారు. గత ఏడాది తండ్రి హరికృష్ణ మరణం నుండి కోలుకోలేదు అని ఎన్టీఆర్ ఎటువంటి పుట్టిన రోజు వేడుకలు జరుపవద్దని కోరారు. ఇక ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే ఉండి క్షేమంగా ఉండాలని, అదే మీరిచ్చే పెద్ద బహుమతి అని ఆయన చెప్పడం జరిగింది.
వీటన్నింటి కంటే ఆశగా ఎదురుచూసిన ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల లేకపోవడం వారిని బాగా ఇబ్బందిపెడుతుంది. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయలేకపోతున్నాం అని ఆర్ ఆర్ ఆర్ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసందే. జక్కన్న హ్యాండిచ్చినా, మరో దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అప్డేట్ ఇచ్చే అవకాశం కలదు. ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రంతో కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనుంది.
నిజానికి మే లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సింది. కాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ లాంటిది ఏమైనా ఉంటుందా అనే ఆశ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పై ఓ వార్త ప్రచారంలో ఉంది. అయిననూ పోయిరావలె హస్థినకు అనే టైటిల్ త్రివిక్రమ్ అనుకుంటున్నారని, ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని వార్తలు వచ్చాయి. ఒక వేళ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా త్రివిక్రమ్ మూవీ టైటిల్ పోస్టర్ వస్తే అంతకన్నా ఫ్యాన్స్ కి కావలసింది ఏముంటుంది. Most Recommended Video