నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్, కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమా నేడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. గత వారం విడుదలైన సినిమాల హవా తగ్గడంతో ప్రేక్షకులు వైల్డ్ డాగ్ , సుల్తాన్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. అయితే వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలు హిట్టైనా ఆ సినిమాల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏప్రిల్ 9వ తేదీన విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమా ప్రభావం వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలపై పడనుందని ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా వారం తరువాత థియేటర్ల నుంచి తొలగించక తప్పదని సమాచారం. వైల్డ్ డాగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో కేవలం వారం రోజులకే అగ్రిమెంట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా వకీల్ సాబ్ రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.
మన దేశంలో దాదాపు 4,000 థియేటర్లలో విదేశాల్లో 700కు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. కరోనా, లాక్ డౌన్ తర్వాత ఈ స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా వకీల్ సాబ్ మాత్రమేనని చెప్పాలి. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన బోనీ కపూర్ విదేశాల్లో వకీల్ సాబ్ మూవీని విదేశాల్లో 700 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా అయిన వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. టికెట్ రేట్లు కూడా గతంతో పోలిస్తే పెరగడంతో వకీల్ సాబ్ అల వైకుంఠపురములో రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.