దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకేక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం ఈ చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయగా అక్కడ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో అద్భుతమైన రికార్డులను దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పలు హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కాగా తాజాగా హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా వరుసగా అరుదైన గౌరవాలను అందుకుంటున్న ఈ సినిమా మరోసారి మరో గౌరవాన్ని సొంతం చేసుకుంది. తాజాగా వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఎంపైర్ మ్యాగజైన్ RRR సినిమా గురించి తమ మ్యాగజైన్ లో ఒక స్పెషల్ ఆర్టికల్ ప్రచురించింది.
ఈ ఆర్టికల్ లో భాగంగా సినిమా గురించి అలాగే రాజమౌళి గురించి ఎంతో గొప్పగా రాశారు. ఈ విధంగా వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ లో RRR సినిమా గురించి ప్రచురించడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన రాజమౌళి మా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇంతగా గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
ఇలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంపైర్ మ్యాగజైన్ లో మా సినిమా గురించి రావడం సినిమా గురించి గొప్పగా రాయడం చాలా సంతోషంగా ఉంది అంటూ రాజమౌళి ఈ సందర్భంగా స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.