Baby Neha: విక్రమార్కుడు రవితేజ కూతుర్ని చూశారా ఎలా ఉందో?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో వారి చిన్నప్పటి పాత్రలలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరో హీరోయిన్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రవితేజ నటన అద్భుతం అని చెప్పాలి ద్విపాత్రాభినయంలో రవితేజ తన నటనతో అదరగొట్టారు.

ఇక ఈ సినిమాలో రవితేజ కూతురు పాత్రలో నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలా రవితేజ కూతురు పాత్రలో నటించిన ఆ చిన్నారి పేరు నేహా తోట.అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించిన నేహా తల్లిదండ్రులు తను చిన్నప్పుడే హైదరాబాదులో సెటిల్ అయ్యారు.ఇక తన తల్లిదండ్రులు తనకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. ఇలా ఈమె విక్రమార్కుడు సినిమాతో పాటు అనసూయ, రాముడు, ఆది విష్ణు, ఆర్జీవీ రక్ష, సర్కార్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

తన అమాయకపు చూపులతో నేహ ఎంతో అద్భుతంగా నటించి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నేహా తన చదువులపై పూర్తి దృష్టిని పెట్టారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె ఎంబీఏ చదువుతున్నారని తెలుస్తోంది. చదువుపై ఆసక్తితో ఉన్నత చదువులు చదువుతున్నటువంటి నేహ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ప్రస్తుతం ఈమెకు (Baby Neha) సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు సినిమాలలో అంత అమాయకంగా నటించిన నేహా నేనా ఇక్కడ అంటూ అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు అంటూ కామెంట్లు చేయగా తన చదువులు మొత్తం పూర్తి అయిన తర్వాత అవకాశాలు వస్తే తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తానని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus