సినిమా పరిశ్రమలో సినిమాల మధ్య విభేదాలు ఉంటాయి గానీ, వ్యక్తుల మధ్య కాదు..మన టాలీవుడ్ హీరోలు స్నేహానికి ఇతర ఇండస్ట్రీలో హీరోలకు ఆదర్శం అని చెప్పుకుంటారు. స్టార్ హీరో స్టేటస్ ను పక్కన పెట్టేసి హీరోస్ చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే చాలామందికి ఫేవరెట్ గా ఉంటాడు . హీరోలా కాకుండా అందరితో తమ్ముడిలా.. ఓ కొడుకులా.. ఓ అన్నలా .. ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ కూడా ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ గా మారిపోయాడు. ఏజ్ లో తనకంటే ఎంతో పెద్దవాడైనా సరే ఎన్టీఆర్ – చిరంజీవితో చాలా సరదాగా మాట్లాడుతారట . అంతేకాదు చరణ్ కంటే ఎన్టీఆర్ అంటేనే చిరంజీవికి ఎక్కువ ఇష్టం అన్న కామెంట్స్ కూడా మనం గతంలో ఓ ఇంటర్వ్యూలో విన్నాం. అయితే అదే చనువుతో మెగాస్టార్ చిరంజీవి – ఎన్టీఆర్ చేసిన సినిమాను చేయనీకుండా అడ్డుపడడానికి ట్రై చేశాడట. ” ఆ కథ నీకు సూట్ అవ్వదు అంటూ ఎంతో ఎంతో చెప్పుకొచ్చారట “.
కానీ ఎన్టీఆర్” ఫ్రెండ్షిప్ కారణంగా మాట ఇచ్చేసాను అంటూ ఆ డైరెక్టర్ కి కమిట్ అయ్యాడు”. మెగాస్టార్ చెప్పినట్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అంతేకాదు ఆ సినిమా ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ సతమతం అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు “ఆంధ్రావాలా”. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆంధ్రావాల సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగా చేశారు . ఈ సినిమా ఆడియో లాంచ్ ఎంత ఘనంగా జరిగిందో..? ఎంతమంది జనాభా వచ్చారో ..? మనకు తెలిసిందే.
అయితే సినిమా రిజల్ట్ మాత్రం వేరేలా ఉండింది . తారక్ ఈ సినిమాకి కమిట్ అయ్యాడు అని తెలియగానే… (Chiranjeevi) చిరంజీవి – తారక్ కి కాల్ చేసి మరి చెప్పారట . “కథ బాగాలేదు. ఈ కథ ఆల్రెడీ పూరి జగన్నాథ్ నాకు వివరించారు.. నేను రిజెక్ట్ చేస్తే నీ దగ్గరికి వచ్చారు . ఈ సినిమా చేస్తే కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది” అంటూ చెప్పాడట . అయినా కూడా తారక్ వినకుండా చేశాడు . ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసినవి