మనలో చాలామంది బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కాగా చాలా సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు. బావర్చిలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని ఒక్కడినే తినేస్తానని తారక్ పలు సందర్భాల్లో చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే యంగ్ హీరో నాగశౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే.
నాగశౌర్య తల్లి ఉష ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. ఆమె ఉష ముల్పూరీస్ కిచెన్ పేరుతో ఒక రెస్టారెంట్ ను మొదలుపెట్టగా ఆ రెస్టారెంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అందింది. నాగశౌర్య తల్లి ఉష ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. వైరల్లీ ఫుడ్ ఇంటర్వ్యూ తర్వాత తమ బిజినెస్ బాగా పెరిగిందని ఆమె అన్నారు.
పలువురు సెలబ్రిటీలు రెస్టారెంట్ కు వస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మటన్ బిర్యానీ పార్సిల్ వెళ్లిందని ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ మటన్ బిర్యానీని కలెక్ట్ చేసుకున్నారని ఉష వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్డర్ చేయడంతో ఈ యంగ్ హీరో రెస్టారెంట్ నుంచి బిర్యానీ వెళ్లిందట. జూనియర్ ఎన్టీఆర్, నాగశౌర్య కుటుంబాల మధ్య మంచి అనుబంధం కూడా ఉందనే సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్ ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నందమూరి హీరో తారక్ కు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొరటాల శివకు ఈ సినిమా సక్సెస్ సాదించడం కెరీర్ పరంగా కీలకమనే సంగతి తెలిసిందే. దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.