యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే. 2009 సంవత్సరంలో తారక్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా కృషి చేశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన తారక్ ప్రస్తుతం లైఫ్ లో సంతోషకరంగా ఉన్నానని యాక్టర్ గా కెరీర్ ను ఆస్వాదిస్తున్నానని ప్రస్తుతం యాక్టింగ్ కే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.
తాను తరువాత సెకన్ గురించి నమ్మే వ్యక్తిని కాదని ప్రస్తుతం ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగిస్తున్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. యాక్టింగ్ ద్వారా నాకు ఎనలేని సంతృప్తి దొరుకుతోందని తారక్ తెలిపారు. ఈ క్షణానికి మాత్రమే తాను కట్టుబడి ఉన్నానని తారక్ వెల్లడించారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికల సమయానికి ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అవుతారని భావించిన వాళ్లకు తారక్ కామెంట్లు నిరాశకు గురి చేస్తాయని చెప్పవచ్చు.
అయితే నటుడిగా తారక్ మరింత ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ ముఖ్య నేతలకు తారక్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం ఇష్టం లేదని అందువల్లే తారక్ ఈ సంచలన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. బాలకృష్ణ గతేడాది పొలిటికల్ ఎంట్రీ జూనియర్ ఎన్టీఆర్ కు ప్లస్ కావచ్చని మైనస్ కావచ్చని అన్నారనే సంగతి తెలిసిందే. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు వెల్లడించడం ఈ సమయంలో కరెక్ట్ కాదని భావించి తారక్ ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తారక్ తర్వాత సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.