తేజ సజ్జ (Teja Sajja) , ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ అనగానే అందరికీ ‘హనుమాన్’ (Hanuman) సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. హిందీలో అయితే ఏకంగా రూ.50 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy). 2021 ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
Zombie Reddy Collections:
‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనంది (Anandhi) హీరోయిన్ గా నటించగా దక్ష నగార్కర్ (Daksha Nagarkar) కీలక పాత్ర పోషించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా (Zombie Reddy) బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో.. ఓ లుక్కేద్దాం రండి :
‘జాంబీ రెడ్డి’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ సినిమా రూ.6.65 కోట్ల షేర్ ని రాబట్టింది. మొత్తంగా రూ.1.65 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అనిపించుకుంది. ఇక ‘జాంబీ రెడ్డి’ కి సీక్వెల్ గా ‘జాంబీ రెడ్డి 2’ కూడా రాబోతుంది. సుపర్ణ్ వర్మ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ అందించబోతున్నాడు.