ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది.మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు.. కంటెంట్ బాగుందంటే అన్ని భాషల్లోని చిత్రాలను చూడటం అలవాటు చేసుకున్నారు. ఇది డబ్బింగ్ సినిమా అని విభజించి చూడటం లేదు, బౌండరీస్ పెట్టుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులకు మొదటి నుండి ఇది అలవాటే. మిగతా భాషల్లోని, రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులు.. లాక్ డౌన్ టైం నుండి ఇలా పక్క భాషల్లోని చిత్రాలను చూడటం అలవాటు చేసుకున్నారు. అందుకే పక్క భాషల్లోని హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.
అయితే తెలుగు ప్రేక్షకులను మొదటి నుండి అలరించేది తమిళ్ డబ్బింగ్ సినిమాలు. ఎక్కువ సక్సెస్ అయినవి కూడా తమిళ సినిమాలే..! కాకపోతే ఇప్పుడు మలయాళ , కన్నడ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో బాగా ఆడుతున్నాయి. తమిళ డబ్బింగ్ సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన తమిళ హీరోల సినిమాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) వారసుడు :
విజయ్ నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.3 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మూవీ ఇది.
2) పీ ఎస్ -1 :
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి హీరోలుగా నటించారు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.81 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
3) సార్ :
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.51 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) బిచ్చగాడు 2 :
విజయ్ ఆంటోనీ నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.23 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
5) కోబ్రా :
విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.19 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ యావరేజ్ అనిపించుకుంది.
6) విక్రమ్ :
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.87 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
7) పెద్దన్న :
రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.63 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
8) తెగింపు :
అజిత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.38 కోట్లు షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది
9) పీఎస్2 :
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.31 కోట్లు షేర్ ను రాబట్టింది.
10) లవ్ టుడే :
ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇవాన హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రానికి దర్శకుడు ప్రదీప్ రంగనాథనే కావడం విశేషం.’ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు రూ.1.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.