ఎన్టీఆర్ కొత్త సినిమా బడ్జెట్ వంద కోట్లు
- December 13, 2016 / 12:41 PM ISTByFilmy Focus
తెలుగు చిత్రాల స్థాయి పెరిగింది. స్టార్ హీరోల సినిమాలు అవలీలగా వంద కోట్లను వసూల్ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మన చిత్రాలకు ఆదరణ లభిస్తుండడంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. తొలిసారిగా బాహుబలి మూవీ వందకోట్ల బడ్జెట్ ని దాటి నిర్మితమైంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ద్విభాషా చిత్రం వందకోట్లతో తెరకెక్కుతోంది. ఆ జాబితాలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ చేరనుంది. ఆయన గత చిత్రం జనతా గ్యారేజ్ 135 కోట్లను వసూల్ చేసింది. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న తారక్ 27 వ చిత్రానికి వంద కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు సమాచారం.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో తారక్ మూడు పాత్రలతో మెప్పించనున్నారు. తమిళ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్నారు. కాజల్ అగర్వాల్, మంజిమ మోహన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ మూవీలో నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. నందమూరి అభిమానులు గర్వంగా ఫీలయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














