బిగ్ బాస్ తమిళ వెర్షన్ వివాదాల్లో చిక్కుకుంది. విశ్వనటుడు కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి నుంచి వార్తల్లో ఉంది. తమిళ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం నడుస్తుందని, షోను ఆపాలని కొన్ని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నిరసనల మధ్యే మొదలైన ఈ షో తాజాగా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్, పార్టిసిపెంట్ గాయత్రి రఘురామ్‌పై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. షోలో భాగంగా కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తోటి హౌస్ మేట్ ను అలగాజనాల్లా ప్రవర్తిస్తున్నారని అని తిట్టింది. ఈ దూషణను పుతియ తమిళగమ్ సంఘం సభ్యులు సీరియస్ గా తీసుకున్నారు.
పేద వర్గాలను కించపరిచారని, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇదంతా చూసి కూడా హోస్ట్ కమల్ హాసన్ ఆ మాటలపై అభ్యంతరం చెప్పకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ విషయంపై కమల హాసన్ ని వివరణ అడిగినా, అందుకు ఆయన సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోగా కమల్, గాయత్రిలు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కింద వంద కోట్లు ఇవ్వాలని పుతియ తమిళగమ్ సంఘం నేత డాక్టర్ కృష్ణ స్వామి డిమాండ్ చేశారు. మరి దీనిపై బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.