ఎన్టీఆర్ కెరీర్ లో అతిపెద్ద విజయాలలో యమదొంగ ఒకటి. సోసియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. యమదొంగ రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడం మరో విశేషం. అప్పటి వరకు సరైన విజయం లేక అల్లాడుతున్న ఎన్టీఆర్ ని ట్రాక్ లోకి తెచ్చింది యమదొంగ. 2003లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
ఆ మూవీ విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్ చేరిపోగా, ఆ తరువాత ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సింహాద్రి నుండి యమదొంగ వరకు ఎన్టీఆర్ ఆరు సినిమాలు చేశారు. వాటిలో సాంబ. రాఖి చిత్రాలు మాత్రమే యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా నాలుగు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. వరుస పరాజయాలతో నిర్వేదంలో ఉన్న ఎన్టీఆర్ కలిసొచ్చిన కాంబినేషన్ రాజమౌళితో జతకట్టడం జరిగింది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ పూర్తిగా సన్నబడిపోయారు. రాఖీ సినిమానాటికి పూర్తిగా షేప్ అవుట్ బాడీలో ఉన్న ఎన్టీఆర్ రాజమౌళి సూచనతో పూర్తిగా బరువు తగ్గారు.
2007 ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అలాగే పోకిరి తరువాత ఆల్ టైం టాప్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది. వరల్డ్ వైడ్ గా యమదొంగ 29కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు యముడు పాత్ర చేయగా, ఎన్టీఆర్ యంగ్ యమ పాత్రలో ఇరగదీశాడు. ఎన్టీఆర్ కి మంచి బ్రేక్ ఇచిన సినిమాగా యమదొంగ నిలిచింది.