Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మన టాలీవుడ్ స్టార్ హీరోల ‘మైల్ స్టోన్’ మూవీస్

మన టాలీవుడ్ స్టార్ హీరోల ‘మైల్ స్టోన్’ మూవీస్

  • May 8, 2019 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన టాలీవుడ్ స్టార్ హీరోల ‘మైల్ స్టోన్’ మూవీస్

25,50,100 ఇవి చూడటానికి ‘రౌండ్ ఫిగర్’ నంబర్లులా కనిపిస్తున్నప్పటికీ కొందరి జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా క్రికెటర్లు, సినీ నటులకి ఈ నంబర్లు ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో హీరోలకి తమ 25, 50 వ చిత్రాలు ‘మైలురాయి ‘ లాంటిదన్నమాట. ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో మనముందుకు వస్తున్నాడు.

అయితే ఇప్పటి వరకూ మన టాలీవుడ్ హీరోలకి ‘మైల్ స్టోన్’ చిత్రం వంటి 25 వ చిత్రాలని ఓ సారి చెక్ చేద్దాం రండి :

1) నందమూరి తారక రామారావు : ఇద్దరు పెళ్ళాలు

1-eedharau-pellalu
టాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా ఎదిగిన రామారావు గారు. ఎఫ్. నాగూర్ గారు తన సొంత సంస్థలో నిర్మించి డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’.

2) అక్కినేని నాగేశ్వర రావు : బ్రతుకు తెరువు

2-brathuku-teruvu
‘అక్కినేని 25’ వ చిత్రమైన ‘బ్రతుకు తెరువు’ చిత్రాన్ని పి.ఎస్.రామకృష్ణారావు డైరెక్ట్ చేసారు. కోవెలమూడి భాస్కర్ రావు గారు నిర్మించిన ఈ చిత్రంలో ‘మహానటి’ సావిత్రి గారు హీరోయిన్ గా నటించారు.

3) ఘట్టమనేని కృష్ణ :బొమ్మలు చెప్పిన కథ

3-bommalu-chepina-katha
అతి తక్కువ సమయంలో 25 చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అయన నటించిన 25 వ చిత్రం ‘బొమ్మలు చెప్పిన కథ’. జి.విశ్వనాథం గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు.

4) కొణిదెల చిరంజీవి – న్యాయంకావాలి

4-nayam-kavalai

మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గారి 25 వ చిత్రం ‘న్యాయంకావాలి’. ఈ చిత్రాన్ని ఏ.కోందండ రామిరెడ్డి గారు డైరెక్ట్ చేసారు. చిరంజీవి గారు మెగాస్టార్ గా ఎదగడానికి డైరెక్టర్ కోందండ రామిరెడ్డి గారి పాత్ర చాలా ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘న్యాయంకావాలి’. అప్పటి రోజుల్లో 5 లక్షణాల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి.. 100 రోజులు ఆడింది. ఈ చిత్రానికి చిరంజీవి 10,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

5) నందమూరి బాలకృష్ణ – నిప్పులాంటి మనిషి5-nippu-lanti-manishi

ధర్మేంద్ర హిందీలో చేసిన ‘క్వాయామత్’ మూవీ ను తెలుగులో బాలయ్య 25 వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’ చిత్రంగా తీశారు. బాలయ్య 25 వ మైలురాయి గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.బి.చక్రవర్తి డైరెక్ట్ చేసారు. రాధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది.

6) అక్కినేని నాగార్జున – జైత్ర యాత్6-jaytra-yatraకింగ్ నాగార్జున 25 వ చిత్రమైన ‘జైత్ర యాత్ర’ ను ఉప్పలపాటి నారాయణ రావు గారు డైరెక్ట్ చేసారు. తనికెళ్ళ భరణి కథ అందించిన ఈ చిత్రంలో నాగార్జున నటనకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా పర్వాలేదనిపించింది.

7)విక్టరీ వెంకటేష్ – కొండపల్లి రాజా

7-kondapali-raja
రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘అన్నమలై’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ 25 వ చిత్రంగా తెరకెక్కించాడు రవిరాజా పినిశెట్టి. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

8) పవన్ కళ్యాణ్ : అజ్ఞాతవాసి8-aagnathavasi పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కు 25 వ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు కల్లెక్షన్లను మాత్రం ఇప్పటి వరకూ మరే స్టార్ హీరో చిత్రం క్రాస్ చేయలేకపోతోంది. ఇది పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పవర్ అనడంలో సందేహం లేదు.

9) మహేష్ బాబు : మహర్షి

9-maharshi
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం మే 9 న(రేపు) విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు,అశ్వినీదత్, పీవీపీ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మహేష్ మంచి నమ్మకంతో ఉన్నాడు.

10)జూ.ఎన్టీఆర్ : నాన్నకు ప్రేమతో

10-nannaku-prematho
ఎన్టీఆర్ 25 వ చిత్రంగా వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ కు మొదటి 50 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.

11)రవితేజ : కిక్

11-kick
మాస్ మహారాజ్ 25 వ చిరమైన కిక్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం 2009 సమ్మర్ కానుకగా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ చిత్రాన్ని టీవీ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు మన ప్రేక్షకులు.

12) గోపీచంద్ : పంతం

12-pantham
‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొన్ని ఆర్ధిక సమస్యల విలన్ గా నటించాడు గోపిచంద్. తరువాత మళ్ళీ హీరోగా మారి వరుస హిట్లందుకున్నాడు. అయితే కె.చక్రవర్తి అనే కొత్త డైరెక్టర్ తో తన 25 వ చిత్రమైన ‘పంతం’ చిత్రం చేసాడు. అయితే గోపీచంద్ పంతం మాత్రం నెగ్గలేదు. ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది.

13) నితిన్ : ఛల్ మోహన్ రంగ

13-chal-mohan-ranga
కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లందుకుని తరువాత 12 ప్లాపులు తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డ ఏకైక హీరో నితిన్. ఇక చాలా గ్యాప్ తరువాత ‘ఇష్క్’ నుండీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో తన 25 వ చిత్రం కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘ఛల్ మోహన్ రంగ’ చేసాడు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.

14) నాని : ‘వి’

14-nani
నాని ని ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తన 25 వ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ‘వి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా తన కెరీర్లో మంచి హిట్ గా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #25th Film Of Our Tollywood Heroes Which Have Been Their Milestone
  • #Agnathavasi
  • #Bommulu cheppina kathalu
  • #Bratuku Teruvu
  • #Iddaru Pellalu Movie

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

3 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

7 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

7 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

12 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

12 hours ago

latest news

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

8 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

9 hours ago
Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్..  ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్.. ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

9 hours ago
స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

10 hours ago
దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version